• Vanajallu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వానజల్లు

    Vanajallu

    Pages: 294
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రావుగారి హీరోలు మాసిన గడ్డాలతో, చిరుగు చొక్కాలతో వుండరు. కుంటి కుక్కపిల్లలు, బిచ్చగాడి ఆర్తనాదాలూ వుండవు. కాలేకడుపులూ, ఎర్రచొక్కాలు వుండవు. పాతివ్రత్యము, పవిత్రబంధాలూ, మంగళసూత్రాల పెట్టుబడి మీద నినాదాలుండవు. ఆయన హీరోలు కలకత్తా, డిల్లీ, బొంబాయిల్లో వుంటారు – రెంట చింతల, రేగుపాలెం అడవుల్లో తుపాకులు పట్టుకు తిరగరు. మెరీన్ డ్రైవ్‌లో షికార్లు చేస్తారు. బ్లూనైల్‌లో డిన్నర్ తీసుకొంటారు. టాక్సీల్లో యిళ్లకు వెళ్తారు. చాలా సందర్భాలలో వర్షం నాయికా నాయకలకి సహకరిస్తుంది. అయినా ఇద్దరూ రూల్సుని అతిక్రమించరు. ఎందుకంటే – వారు రావుగారి పాత్రలు. రావుగారిలాగే పెద్దమనుషులు.

ఇన్ని కథలూ – ఓ నాయకుడు – ఓ అమ్మాయికి మధ్య పల్చని తెరల గురించే. ఆడపిల్లలేని కథ లేదు – ఆడపిల్ల గురించి ప్రస్తావించని కథ లేదు – అది భార్య అయినా ప్రేయసి అయినా – ఇది రచయిత సంతకం. ఆయన మానసిక పరిధి.

ఒక్క తెలుగు కథ విషయంలోనే – మన సాహిత్యం ప్రపంచస్థాయితో పోటీ పడే స్థితిలో వుందని నాకు గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని బలపరిచిన ఈ తరం మంచి రచయితల్లో ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు ఒకరు.

చివరగా – ‘వానజల్లు’ రావుగారి అభిమాన కథానిక అంటారాయన. నేనాయనతో ఎంతమాత్రం ఏకీభవించడంలేదు. ఈ కథా సంపుటమంతా ‘వానజల్లు’లాగే కనిపిస్తోంది నాకు.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Vanajallu