• Vana Kurisina Ratri
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాన కురిసిన రాత్రి

    Vana Kurisina Ratri

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎవరికోసం వస్తాదో తెలీదు

ఎవరికోసం రాదో అదీ తెలీదు

దానికి వీలయినప్పుడు వస్తాది

దానికి ఖాళీ అయినప్పుడు వస్తాది

తాటాకు గుడిసెమీద

ఉక్కు పాదం మోపి

అకస్మాత్తుగా వస్తాది

ఇదిగో ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఈ రాత్రి వేళ

గుండెల్ని చెరువు చేస్తూ

హోరున కురుస్తున్న వానకి

తుంపర్లు చెదిరి

మట్టి గుమ్మం నానిపోయింది

చెట్టుకింద నిద్రపోతున్న కుక్క

వానకి నమస్కారం చేస్తుంది

వాన కురుస్తూనే వుంది

ఎంతసేపు ఆగుద్ది

నాలుగడుగుల గుడిసె కదా

కాసేపటికే తడిసి ముద్దయింది

తడిసిపోయిన గుడిసె ఏం మాట్లాడుతుంది

మాట్లాడగలిగే నేను మాత్రం చేసేదేముంది

క్రమంగా వాన తగ్గింది

చెట్టుకింద కునుకు తీసిన కుక్క

లేచి, చెవులాడించి, వొళ్ళు విరుచుకుంది

తడిసిపోయిన గుడ్డల్ని పిండుకుంటూ నేను

చెదిరిన గుండెను చేరదీసుకుంటూ నా గుడిసె.

Preview download free pdf of this Telugu book is available at Vana Kurisina Ratri