• Vajrayudham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వజ్రాయుధం

    Vajrayudham

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అభ్యుదయ సాహిత్య చరిత్రలో ''వజ్రాయుధం'' మరో ఉదయ బింబం. సోమసుందర్‌ కృతుల్లో ప్రముఖమైందీ, ప్రత్యేకంగా పేర్కొనదగిందీ, ఇతని అభ్యుదయ వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తెచ్చిందీ. ఇందులో కవి ఆదర్శమైన సామ్యవాద వాస్తవ చిత్రణం ఆవిష్కృతమైంది. సంవిధానంలో ఉద్రేకాన్ని నిలుపుతూ వేగాన్ని సాధించే శిల్పరచనకు ఔజ్వల్యాన్ని కలిగిస్తూంది. ఆదర్శమూ, సంవిధానమూ రెండూ సమన్యయాకృతిని పొందంతో రచనకు విశిష్టత చేకూరింది.

అంధ విశ్వాసాల తిరస్కారం, హేతువాద దృక్పథం, ప్రజా సన్నిహితత్వం, వాస్తవిక చిత్రణం, సమస్యల విశ్లేషణలో మార్క్సు సిద్ధాంతాల సమన్వయం, సామాన్యునిపట్ల సానుభూతి, వైజ్ఞానిక యుగ వివేకం, అన్న అంశాలు స్థూలంగా క్రొత్త సాహితీ వ్యవస్థను తీర్చాయి. ఈ ''క్రొత్త'' రూపం దీనికి పూర్తిగా భిన్నమయిన ''పాత'' స్థానంలో అవతరించింది. క్రొత్త వ్యవస్థకు బలం చేకూర్చే అభ్యుదయ శక్తులను సమీకరించే ప్రయత్నంలోని భాగమే ''వజ్రాయుధం''. ఈ రూపురేఖలతో నిత్యమూ అనుభవంలోకి వచ్చే జీవితాన్ని స్పందింపజేస్తూ, చేరదలచుకొన్న గమ్యాన్ని నిర్దేశిస్తూ ఆరంభమయిన క్రొత్తయుగానికి ''వృద్ధ జగతి సమాధిపై సమధర్మం ప్రభవిస్తూ'' ప్రాతినిధ్యం వహిస్తూంది. ఆధునికతకు ప్రాతినిధ్యం వహించే అభ్యుదయోద్యమం, మానవుని ప్రయాణంలో ఎదురయ్యే నిమ్మోన్నతాలను సమానం చేసే దృష్టితో ఇందుకు కారణభూతులయిన పీడకుల వ్యూహాన్ని ఛేదిస్తూ పీడితుల అసహాయతను మార్చి శక్తివంతమయిన సాధనంగా రూపొందించే అక్షరాకృతి ఈ కవితా సంపుటి.

చరిత్రలో ఒక పరిణామ దశకీకృతి ప్రతిబింబం. ఒక వ్యవస్థనుండి మరో వ్యవస్థకు మారే ప్రగతిమూర్తికీ కవి ప్రతినిధి. ''మహాప్రస్థానం'' తరువాత పరిగణింప దగిన అభ్యుదయ కృతుల్లో ఉత్తమ కృతి ''వజ్రాయుధం.''

- ఆచార్య మాదిరాజు రంగారావు

Preview download free pdf of this Telugu book is available at Vajrayudham