• Upanishat Sudhalahari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    192
    37.5% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉపనిషత్ సుధాలహరి

    Upanishat Sudhalahari

    Publisher: Yuva Bharathi

    Pages: 204
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అమూల్యమైన జ్ఞానసంపద ఉపనిషత్తులలో నిక్షిప్తమై వుంది. వ్యక్తి సామాజికునిగా అనుసరించవలసిన ధర్మం గురించీ, అతనికి సమాజం పట్ల గల బాధ్యతల గురించీ, తన కుటుంబంతో, సాటివారితో మెలగవలసిన తీరుతెన్నుల గురించీ, ఉపనిషత్తులలో పేర్కొనబడిన విషయాలు - సర్వకాలాలకూ అనుసరణీయాలైనవి
వున్నాయి.

సమాజంలో వున్న వివిధ వర్గాలకి చెందిన మనుషులంతా మనకి ఉపనిషత్తులలో గోచరిస్తారు. ‘సత్యాన్వేషణకు అందరూ అర్హులే’ అని చెప్పడానికి సత్యకాముడు, గార్గిలాంటి స్త్రీ కన్పిస్తారు. ఉపనిషత్తులది విశాలదృక్పథం. సమ్యక్‌దృష్టి ప్రధానంగా దశోపనిషత్తులు - లభ్యమౌతున్న 188 ఉపనిషత్తులలోనూ సమగ్ర సమాహార సంపదగా భావింపబడుతున్నాయి. ఎన్నుకున్న దశోపనిషత్తులలోని సామాజికాంశాలను ఆయా ప్రసంగకర్తలు వ్యాసరూపేణా అందించగా ఇందులో సంపుటీకరించాం.

ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్‌, బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాశ్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు అనే ఈ పది ఉపనిషత్తుల గురించీ, వాటిలోని సామాజికాంశాల గురించి పండితులు 'ఉపనిషత్సుధాలహరి'లో చేసిన ప్రసంగవ్యాసాల సంపుటి ఈ గ్రంథం.

ఏది తెలుసుకోవడం వల్ల మరేదీ తెలుసుకోవలసిన అవసరం లేదని తెలుసుకుంటామో, నీ, నా అనే భేదభావాలు మరచి, అంతా ఒక్కటేననే భావనతో, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతామో, బహిరంతర ఆత్మావలోకనంతో సమాజాన్నీ, అంతర్గత ప్రపంచాన్ని కూడా అర్ధం చేసుకున్న అసలయిన చదువుతో అమందానంద మోక్షస్థితిని చేరుకోగలుగుతామో, ఆ ప్రయాణానికి ఉపనిషత్తులు దారి చూపి తీసుకువెడతాయి. ఆ దీపధారిగా యువభారతి ఈ ఉపనిషత్సుధాలహరితో ఏ మేరకు ఉపకరించినా ధన్యయే. ఈ గ్రంథం చదువరులకు సమాదరణీయమవుతుందని ఆకాంక్ష.

- సుధామ

Preview download free pdf of this Telugu book is available at Upanishat Sudhalahari