-
-
ఉనికిపాట్లు
Unikipatlu
Author: Aelikatte Shankar Rao
Publisher: Amruta Prachuranalu
Pages: 162Language: Telugu
తాను ప్రత్యక్షంగా గతంలో చూసినవాటిని వర్తమానంలో చేసుకున్న అవగాహనతో సామాజిక జీవనకోణాలను కథలుగా మలవడం ఒక పద్ధతి. ఈ పద్ధతే ఎలికట్టె శంకరరావు ప్రత్యేకత. కథా రచయిత నిజాయితీగా తన పాత్ర తాను పోషిస్తాడు. అంటే ఒక గ్రామం బొడ్రాయి వద్ద నిలబడి కథను చెబుతాడు. అందుకే గ్రామీణ జీవన వాస్తవికతను చెప్పడానికి అతను ఎంచుకున్నది గ్రామీణులు వాడే మాండలిక భాషే. కథని అల్లుతూ అల్లుతూ రచయిత కూడా తాను గ్రామీణుడైపోతాడు. ఆ మొత్తం వాతావరణంలో పరాయి గొంతు, భాష, భావన ఎక్కడా కనిపించదు. ఆ రకంగా అచ్చమైన దేశీకథలు ఇవి.
- జయధీర్ తిరుమలరావు
* * *
తెలంగాణ యాసలో అదీ నల్లగొండకు ప్రత్యేకమైన యాసలో కథలు అరుదుగా వచ్చాయి. ఎలికట్టె శంకర్రావు ఈ యాసను అద్భుతంగా కథలలో పండించారు. శంకర్ కథల్లో పల్లెతనం కనిపిస్తుంది. తెలంగాణ హృదయం కనిపిస్తూ ఉంటుంది. పల్లె జీవితంలోని పాత్రలన్నీ కనిపిస్తాయి.
ఆయన కథల్లో ఒక్కో కథ ఒక్కో సామాజిక నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన ఎక్కడా సిద్ధాంతాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కాని ప్రతి కథలో కొన్ని విలువలను ప్రతిఫలింపజేశారు.
- కట్టా శేఖర్‌రెడ్డి
