• Tyagaratna
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్యాగరత్న

    Tyagaratna

    Publisher: Samskruti, Guntur

    Pages: 296
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మగారి జీవితకథని నవలగా రాయటమంటే సమాజంలోని రెండు ప్రధాన వివక్షలను అర్థం చేసుకుని చారిత్రకంగా ఆ వ్యవస్థల్లో వచ్చిన మార్పులనూ, ఆ మార్పులు సంభవిస్తున్న కాలంలో వ్యక్తుల జీవితాలలో చోటుచేసుకున్న సంక్షుభిత సందర్భాలనూ పాఠకులకు పరిచయం చేయటం. ఆ క్లిష్టమైన పనిని తల పెట్టి “త్యాగరత్న" నవలను మనకందించారు ప్రొఫెసర్ మలెయూరు గురుస్వామిగారు. కన్నడ భాషలోని ఈ ఉన్నత సాహిత్యకృషిని తెలుగు పాఠకులకు అందించటానికి శ్రమించారు. రచయితగా, అనువాదకులుగా తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితులైన రంగనాథ రామచంద్రరావుగారు.

ఒకానొక సంధికాలంలో, సామాజిక అణచివేత మూలాలుగా ఉన్న జండర్, కులం అనే సాంఘిక వ్యవస్థలతో తలపడి, సంఘర్షించి, మానవీయ విలువలున్న వ్యక్తిగా, గొప్ప సంగీత, నృత్య కళాకారిణిగా, కళారాధకురాలిగా రాణించి చరిత్రలో నిలిచిపోవటం సామాన్యమైన విషయం కాదు. నాగరత్నమ్మ సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె పుట్టింది సామాన్య నేపథ్యంలోనే. చెప్పాలంటే సామాజిక గౌరవానికి నోచుకోని కుటుంబ నేపథ్యం ఆమెది. దేవదాసి కులంలో, ఆ కులం తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాలంలో జన్మించి, తన జీవితకాలంలో సంభవించిన, సంఘర్షించిన సామాజిక వైరుధ్యాల నడుమ జీవించి చరిత్ర సృష్టించింది నాగరత్నమ్మ. చరిత్ర నిర్మాతలలో ఒకరిగా మిగిలిపోయింది.

ఆమె జీవితకథ రాయటం తేలిక కాదు. కానీ తేలికగా ఆ పని చేసినట్లు, సునాయాసంగా పాఠకులను ఆ కాలంలోకి, నాగరత్నమ్మ వ్యక్తిగత, సాంఘిక జీవితంలోకి తీసుకెళ్తారు మలెయూరు గురుస్వామిగారు. కథాంశం క్లిష్టమైనది. కథనం కూడా క్లిష్టమైతే పాఠకులు ఇబ్బంది పడతారు. అందువల్ల సరళమైన కథన రీతిలో, చతురమైన కథాశిల్పంతో నవలను తీర్చిదిద్దారు గురుస్వామిగారు. ఒక ప్రవాహంలా, ప్రవాహంలో పడవ ప్రయాణంలా సాగిపోతుంది నవల. ఆయన ఈ నవల రాయటానికి ఎంతో పరిశోధన చేసి ఉంటారు. కానీ ఆ పరిశోధనాయాసంగానీ, ప్రయాసగానీ మనకు కనబడదు. అదంతా తన అంతరంగంలో దాచుకుని ప్రసన్నరీతిలో, ఒక నవలా రూపంలో ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించారు. స్త్రీలు చరిత్రను నడిపించారు, నిర్మించారు అని ధీమాగా చెప్పటానికి యిటువంటి నవలలు, నవలా రూపంలోని జీవితకథలు దోహదం చేస్తాయి. అందువల్ల ఈ నవలకు సాహిత్యంలోనే కాక, చరిత్రలో, స్త్రీల చరిత్ర నిర్మాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అనుకూలాంశాలను ఉన్నతంగా రాసే రచయిత స్వభావం వల్ల సంగీతాంబుధిలోని రత్నాలెన్నో ఈ నవలలో ప్రకాశించాయి. కళాకారుల మధ్య ఉండే స్పర్థలను చిన్నగా ప్రస్తావించి, గురుశిష్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను, సమఉజ్జీల మధ్య స్నేహాభిమానాలను ఉన్నతంగా చిత్రించారు. వాటి నుంచి ఈ తరంవారు నేర్చుకోవటానికి ఎంతైనా ఉంది.

- ఓల్గా

గమనిక: " త్యాగరత్న " ఈబుక్ సైజు 8.4mb
Preview download free pdf of this Telugu book is available at Tyagaratna