• Turaga Janaki Rani Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తురగా జానకీరాణి కథలు

    Turaga Janaki Rani Kathalu

    Publisher: Turaga Foundation

    Pages: 432
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా కథల్లో సామాజిక స్పృహ అనేది లేదని నాకు అర్థమైంది. మనోవిశ్లేషణే ఎక్కువగా వుందని అనిపించింది. కులం, వర్గాలతో సంబంధం లేకుండా మనస్సులు పోయే పోకిళ్ళను వర్ణించాననిపించింది. ఇది నా మొదటి నివేదన. కుటుంబ విలువలకు, వ్యక్తుల మధ్య పరస్పరం ప్రేమలకు నేను ప్రాధాన్యత యిచ్చాను. ఏదైనా ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఒక సత్యం - నాకు తారసపడినపుడు వాటిని గురించి కథ రాశాను. కథలు రాయడం నా ప్రధాన వ్యాపకం కాదు. తలమునకలు చేసి తబ్బిబ్బుగావించే పరిస్థితులలో ఏదో ఒక సమయం చూసి కథ రాశాను. అయితే నా కథలలో భాష అంటేను, పదాల పొందిక అంటేను, భావ ప్రకటన తీరు అంటేను నాకు ఇష్టం.

ఆడవాళ్ళ జీవితం చాలా క్లిష్టమయిందని, కష్టమయిందని నేను ఆలస్యంగా గ్రహించాను. ఇది ఇంతే కాబోలు అనుకునేదాన్ని. అందుకే నవ్వుతూ సంతోషంగా కనిపించే స్త్రీలంటే నాకు ఎంతో గౌరవం. వీరు ఎని ్నంటిని దాటుకుని అలా వచ్చారో ఊహిస్తూ వుంటాను. అందుకే నా కథలలో అన్నీ స్త్రీ పాత్రలే.

ఈ సంకలనంలో సుమారు ముప్ఫై కథలు 1961, 1972, 1988ల్లో వేసిన సంకలనాల్లో వచ్చాయి. కానీ వాటి మీద మక్కువతో, ఎవరికీ అంతగా జ్ఞాపకం వుండవనే భరోసాతో ఇందులో చేర్చాను. ఇవి నా బాణీ కథలు.

- తురగా జానకీరాణి

* * *

జానకీరాణిగారు అర్ధశతాబ్దికి పూర్వం రాసిన కథానికలను చదివినా, ఇప్పుడిప్పుడు రాసినవాటిని చదివినా మనం తప్పకుండా స్పందిస్తాం; తృప్తిపడి ఆనందిస్తాం. ఒక్కొక్క కథ ఒక్కొక్క ద్వీపంలా, అన్నీ కలిసిన ఒక దీపతోరణంలా కనిపిస్తాయి. అన్నీ హాయిగా చదివించే కథలు. వర్ణనలన్నీ, ఒక చిత్రకారుడు కుంచెతో తీర్చిదిద్దిన దృశ్యబంధాలు. అమూర్తభావాలకు మూర్తవస్తువులకు చూపిన పోలికలు మంచి ఉపమాలంకారాలకు ఉదాహరణలు. వస్తువరణపరంగా, కల్పనాశిల్పపరంగా, కథన నైపుణ్యపరంగా, సహజజీవిత చిత్రణపరంగా వన్నెకెక్కిన మేటి కథానికల రచయిత్రి శ్రీమతి జానకీరాణిగారు.

- పోరంకి దక్షిణామూర్తి

Preview download free pdf of this Telugu book is available at Turaga Janaki Rani Kathalu
Comment(s) ...

చక్కని కథలు – ‘తురగా జానకీరాణి కథలు’ పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3363