• Triveni
  • Ebook Hide Help
    ₹ 60
    216
    72.22% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రివేణి

    Triveni

    Pages: 119
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తను చిలక్కి చెప్పినట్టు చెప్పి హెచ్చరించి మరీ ఢిల్లీ వెళ్ళాడు. తన హెచ్చరికను పెడచెవిన పెట్టి ఏదో సమస్యలో తలదూర్చింది. దాని ఫలితంగా ప్రభాకర్ సార్ పోయారు. ఇద్దర్నీ చంపాలని ప్లాన్ చేసారంటే వీళ్ళిద్దరూ తెలిసిచేసిన పొరబాటు ఏదో వుంది. అర్జంటుగా త్రివేణిని ట్రేసవుట్ చేయకపోతే ఆమె ప్రాణాలని ప్రమాదం.

“నాకెందుకో భయంగా వుందయ్యా. అది ఇంతవరకు ఫోన్ చేయలేదంటే ఆ రాక్షసులు దీన్ని కూడా చంపేసి వుంటారని భయంగా వుంది” అంది ఏడుపుగొంతుతో బామ్మ.

“లేదు లేదు... నువ్వలా అధైర్యపడకు బామ్మా. త్రివేణి చదువుకుంది. తెలివైంది. పరిస్థితి తనకు తెలుసు గాబట్టి అంత సులువుగా వాళ్ళకి చిక్కదు. నేను చూసుకుంటాగా. నువ్వు ధైర్యంగా వుండు” నచ్చచెప్పాడు.

“ఏం ధైర్యమో బాబూ! పిల్లకోసం ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. దీనికి ఏమన్నా అయితే అమెరికాలో వున్న నా కొడుకు కోడలికి ఏం బదులు చెప్పాలో తెలీటంలేదు. వాళ్లకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పేద్దాం. అనుకుంటున్నాను.”

“వద్దు బామ్మా. తొందరపడి ఆ పని చేయకు. వాళ్ళు కంగారుపడి బయలుదేరి వచ్చినా వచ్చేస్తారు. త్రివేణి ఆచూకీ నేను తెలుసుకుంటాగదా. నీకేకాదు, తనకి ఏమన్నా అయితే తట్టుకునే శక్తి నాకూ లేదు. నా త్రివేణికి హాని తలపెట్టినవాళ్ళు ఎవరయినాగానీ... వాళ్ళని వదలను. అవసరమైతే చంపేస్తాను. తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకో. త్రివేణి ఫోన్ చేస్తే మాత్రం ముందు నా సెల్ నంబర్ ఇవ్వటం మర్చిపోకు” అంటూ లేచాడు శశిప్రీతమ్.

Preview download free pdf of this Telugu book is available at Triveni