• Trikala Yagnam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    144
    58.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రికాల యజ్ఞం

    Trikala Yagnam

    Pages: 368
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

ఏమిటీ సాంద్రలోని ప్రత్యేకత?

ముఖంలో ఆ తేజస్సు... కళ్ళలో అంతులేని ఆకర్షణ. ఇదీ అని చెప్పలేని గొప్ప హుందాతనం... ఆలోచించి మాట్లాడే పద్ధతి.... సహజంగా ఈ వయస్సులో ఉండాల్సిన హుషారు, చిలిపితనం, హాస్యం, మొండితనం, పట్టుదల.... ఆమెలో అసలే మాత్రం కన్పించవు.

తమాషాగా ముసలమ్మవే అంటూ తాము ఆటపట్టించినా కేర్‌ చేయదు. ఎప్పుడూ దీర్ఘంగా దేనిగురించో ఆలోచిస్తున్నట్టు కన్పిస్తుంది. ఇంకా చెప్పాలంటే వయసుకు మించి పరిణతి చెందిన వ్యక్తిత్వం ఆమెది.

ఇవన్నీ అలా వుంచితే జరగబోయే సంఘటన ఊహించడం సాధ్యమా? జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా రోజులు, నెలలు లేదా సంవత్సరం తర్వాత ఏదో జరుగుతుందని చెప్తారు గాని, పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎలా చెప్పగలరు? కాని ఇప్పుడు సాంద్ర చెప్పింది.

అయిదు నిమిషాల్లో వర్షం ఆగిపోతుందని చెప్పింది. ఖచ్చితంగా చెప్పినట్లే జరిగింది. ఆ వీధిలో ముందుకు పోకుండా ఆపేసింది. దగ్గర దారి వదిలి చుట్టూ తిరిగిపోవాలని ఎవరూ కోరుకోరు. తప్పించుకోవడానికి సాంద్ర ఎన్ని చెప్పినప్పటికీ, ఖచ్చితంగా ఆ బిల్డింగు కూలిపోతుందని తెలిసే ఆపిందని తను పూర్తిగా విశ్వసిస్తోంది.

అదే సమయంలో ఇది సాధ్యమా అన్న అనుమానమూ కలుగుతోంది. కో-ఇన్స్‌డెంట్‌ అనుకుని సరిపెట్టుకుందామన్నా సాధ్యం కావడం లేదు. అందుకే మరునాడు సాంద్రను అడిగి నిజం తెలుసుకోవాలని ఒక నిశ్చయానికి వచ్చాకగాని నసీమాకు నిద్ర పట్టలేదు.

Preview download free pdf of this Telugu book is available at Trikala Yagnam
Comment(s) ...

వెరీ నైస్.. బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్పించి..