• Tranku Pette
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ట్రంకుపెట్టె

    Tranku Pette

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక చిన్న బిందువు దగ్గర ప్రయాణం మొదలుపెట్టి, తన నిరంతర ఊర్థ్వ గమనంతో పరిశ్రమించిన కవి, కథకుడు, మిత్రులందరికీ ఒక సుహృల్లేఖ - శ్రీ మోకా రత్నరాజు. ఆయన విన్నపాలు పాడినా, కవితలు చదివినా హర్షపులకితమవుతారు. మొదటినుంచీ తన ప్రతిభను పెంచుకుంటూ ఒక మంచి స్థాయిని పొందిన మోకా రత్నరాజు మా అందరికీ అత్యంత ఆత్మీయుడు. అభివృద్ధి పథంలో ఇంకా ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకు నా శుభాకాంక్షలు. అభినందనలు

- డా. అద్దేపల్లి రామ్మోహన్ రావు, కాకినాడ

పల్లె పనిముట్లను కవిత్వపరం చేసి, కళ్ళకు బొమ్మకట్టించి చూపడంలో నేర్పరితనం గల మోకా రత్నరాజు 'ట్రంకుపెట్టె' కవితా సంపుటిని తీసుకురావడాం సంతోషంగా ఉంది. ఈ సంపుటిలోని దుడ్డుకర్ర కవితలో ప్రతి ప్రతీక సజీవ దృశ్యంగా నిలుస్తుందనడంలో అతిశయోకిత్ లేదనుకుంటాను. అలాంటి మోకా రత్నరాజుకి ఆశీస్సులు, అభినందనలు.

- డా. ఓలేటి పార్వతీశం, హైదరాబాద్ దూరదర్శన్

చినుకు, చినుకు ధారగా సెలయేరుగా నదిగా సాగరంగా ప్రవాహవేగాన్నందుకున్నట్టు మినీ కవితలతో ప్రారంభమైన రత్నరాజు కవితా ప్రస్థానం శ్రామిక జీవుల చేతిలో దుడ్డుకర్రగా, డొక్కతాడుగా, ప్రాణం పోసుకొని మట్టిబంధాన్ని పెనవేసుకొని తెలుగు కవితాకాశంలో విహంగమై విహరించడం, ఆయన ఎదుగుదలను చెబుతోంది.

- జి. సుబ్బారావు, కళాసాహితి, కొత్తపేట

కవి మిత్రుడు మోకా రత్నరాజు 'విన్నపాలు' తెలుగును ప్రేమించే అనేకానేకమందికి చిరపరిచితం. ఉత్తరాల మనిషిగా - విన్నపాల కవిగా రాష్ట్రంలో అనేక కితాబులందుకున్నాడు. ఒక శ్రమ, ఒక వేదన, దిగమింగుకున్న కొన్ని కష్టాలు ఈ సంకలనం రావడానికి కారణాలు ఈ ట్రంకుపెట్టెలోని కవితలు మనం నిత్యం చూస్తున్న మాములు పరికరాలు. కవితామయమై కనిపిస్తాయ్. చదువరులను కట్టిపడేస్తాయ్.

- పి.ఆర్. ఎల్. స్వామి, యానాం

Preview download free pdf of this Telugu book is available at Tranku Pette