• Tolety Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తోలేటి కథలు

    Tolety Kathalu

    Publisher: Surya Prachuranalu

    Pages: 196
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాత్రి పది గంటలయింది. అంతా వెన్నెలగానే ఉన్నా, చూరు కింద మాత్రం కరెంట్ పోవడం వలన చీకటిగా ఉంది. అరుగుమీద శాలువా కప్పుకుని, పడక కుర్చీలో పడుకుని చుట్ట గుప్పుతున్న అప్పాజీ మొహం అగుపించడం లేదు కాని చుట్టనిప్పు మాత్రం డేంజరు లైటులా వెలుగుతూ కనిపిస్తోంది.

'ఎలా ఉంది కేంపేను?' - అప్పాజీ అడిగారు.

అరుగు ఎదురుగా కొబ్బరాకుల పందిరి కింద పది, పదిహేను మంది బల్లల మీద కూర్చుని ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. పలచగా వేసిన కొబ్బరాకులలోంచి వెన్నెల పొడలు, పొడలుగా వాళ్ల మీద పడి, వాళ్ళు వెదురు పొదలలో మాటువేసిన పులుల్లా కనిపిస్తున్నారు. పందిరి కింద పులులకి జరుగుతున్న ఎన్నికలతో ప్రత్యక్ష ప్రమేయం లేదుగాని అవి అప్పాజీ గురుత్వం కింద వేట నేర్చుకుంటున్న ఎప్రంటిస్ పులులు.

'తద్దినంలా ఉంది - ఓ వాలు పోస్టరు లేదు - ఓ కటౌట్ లెదు - ఓ ఊరేగింపు లేదు - ఉన్నా శవం ఎనకాల పది మంది ఏడ్చినట్టు కేండిడేట్ ఎనకాల ఓ వందమంది..... ఛ.... ఛ.... ఇంక జనాల్ని సూస్తే 'ఆడూ ఎదవే, ఈడూ ఎదవే - ఏ ఎదవకి ఓటెయ్యమంటావురా ఎదవా' అంటున్నారు...'

ఆ మాట చెవిని పడగానే భూకంపం వచ్చినట్లు, అరుగుమీద డేంజర్ లైట్ పైకీ కిందకూ ఊగి, ఊగి, కిందకి జారింది. జలుగు చేసిన ముసలి గొర్రె దగ్గినట్లు ఆగకుండా దగ్గు వినిపించింది.

Preview download free pdf of this Telugu book is available at Tolety Kathalu