-
-
తిలక్ కథలు 3
Tilak Kathalu 3
Pages: 243Language: Telugu
దేవరకొండ బాల గంగాధర తిలక్ రచించిన కథలని నాలుగు భాగాల ఈ-బుక్స్‌గా సమర్పిస్తోంది కినిగె. ఇది మూడవ భాగం. ఇందులోని కథలు
నల్లజర్ల రోడ్డు
ఓడిపోయిన మనిషి
సీతాపతికథ
అతనికోరిక
ఊరిచివర ఇల్లు
సుందరీ - సుబ్బారావు
సముద్రపు అంచులు
జీవితం
* * *
వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలీ - రేపటిని గూర్చిన భయమూ లేకుండా గౌరవంగా బతకాలని కోరని వారుండరు. కాని ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టం అని వీరయ్యకి తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వమూ నిరాశా రోగమూ లాంటి పెద్ద పెద్ద అగడ్తలుంటాయి. పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనదీ అపాయకరమైనదీకూడా. కాని వీరయ్య ధనం దేనికైనా మూలం అని గుర్తించాడు. కేవలం తన కష్టంవల్లనే తప్ప మరోమార్గం సంపాదనకి లేదనీ తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కాని యీ చంచల పదార్థం ఉన్న చోటికే వెళ్లే దుర్గుణం కలిగి ఉందనీ అతనికి తెలియదు. ఏమైనా దారిపొడుగునా జయించుకుపోవాలనే పట్టుదల అతనిలో వుంది. అందుకోసమే తక్కిన తన వాళ్ళల్లో ఉన్న అలసటనీ అవినీతినీ తనలోంచి తుడిచిపెట్టి నియమబద్దంగా బతకాలనుకున్నాడు. అందుకోసమే నరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగాడు.
పడవ సముద్రంలో వూగింది. రెండుకుండలలో గంజీ కూడూపెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ఎండముదిరిన వేడికిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. "నాను కూడువొండి ఎదురు చూపులు చూత్తూంటాను." అంది చంద్రి.
* * *
చక్కని, ఆలోజింపజేసే కథలను ఆస్వాదించండి!!

- ₹108
- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹60