• Thrisenku Swargam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    118.8
    39.39% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రిశంకుస్వర్గం

    Thrisenku Swargam

    Pages: 126
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనసు మూలాలను తాకుతూ మౌనాన్ని చేధించుకుని నిట్టూర్పుతో రాలే కన్నీటి వెచ్చదనాన్ని గుర్తుచేసే రసాత్మక వాక్యాలతో కూడుకున్న కవితలెన్నో 'త్రిశంకు స్వర్గం'లో పలకరిస్తాయి. సమాజాన్ని తన యుద్ధభూమిగా కొలిచి కలం అనే అస్త్రంతో పోరాటం సాగించిన కవయిత్రి రోజారమణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

- డా. సి. వి. కొండయ్య

* * *

శిల్పకారుడు శిల్పాన్ని చెక్కేటపుడు ఉలిని సుత్తితో ఏ భాగంలో ఎంత దెబ్బకొట్టాలో అంతటి శక్తినే వాడతాడు. అలాగే కవయిత్రి శ్రీమతి రోజారమణి తన కవితా వస్తువుని తీసుకొని కవిత్వం అల్లేడప్పుడు ఎక్కడ ఎలాంటి పదం వేయాలో ఎంత భావం స్ఫురించేట్లు చూడాలో, ఆ వస్తువు భావగర్భితంగా మనసు పొరల్లోకి చొచ్చుకుపోయేటట్లుగా చాలా చక్కగా అన్వయించి వ్రాసారు. అందుకే ఇది త్రిశంకు స్వర్గం నుండి వర్షించిన కవితామృతం అంటాను నేను.

- తూములురి రాజేంద్రపసాద్

* * *

జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి. మీరు ఏ అధ్యాయంలోకి వెళ్ళి పరిశోధించినా... ప్రాంత, వర్గ, వాద, లింగ బేధం లేకుండా సమకాలీన సమాజాన్ని ఉతికేసి దండెంపై ఆరేశిన కవయిత్రి బోయపాటి రోజారమణి ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వ్యక్తిగా ప్రతి కవితలో కనిపిస్తారు. మనిషి మూలం మారుతున్న సమాజాన్ని అనేక కోణాల్లో పరిశీలించిన కవయిత్రి గుండె విలపించిన సందర్బాలెన్నో కనిపిస్తాయి ఈ 'త్రిశంకు స్వర్గం'లో.

- మౌనశ్రీ మల్లిక్

* * *

'త్రిశంకు స్వర్గం' చదివాక నా ఆలోచనలు మళ్ళీ 70, 80 దశకాలకు వెళ్ళాయి. నిండైన వచన కవిత్వం కనుమరుగు కాలేదని భరోసా ఏర్పడింది. ఆనాటి శ్రీశ్రీ 'మహాప్రస్థానం'తో సమం కాదు గానీ ఆ దారిలో నడిచిన మంచి కవిత్వమే ఇది. భావ పరిపుష్టి పుష్కలంగా ఉండి, సమాజాన్ని మేల్కొలపాలనే తపన రోజారమణి గారు తన రచనల్లో పొందుపరిచారు. మున్ముందు వీరి కలం స్వచ్ఛమైన అగ్నికణాల్ని రాలుస్తుందని నా అంచనా, ఆకాంక్షా.

- గుత్తికొండ సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Thrisenku Swargam