• Ten Against Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టెన్ ఎగైనెస్ట్ షాడో

    Ten Against Shadow

    Author:

    Pages: 336
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అదే సమయంలో ఆ గదిలోకి అడుగుపెట్టారు హోమ్ మినిస్టర్ గారు.

తమ బాస్‌తో పాటు లేచి నిలబడి స్మార్ట్‌గా శాల్యూట్స్ చేస్తున్న స్నేహితులు ముగ్గుర్నీ గమనించేసరికి, కొంచెంగా తెరిపిన పడింది విచారంగా వున్న ఆయన ముఖం.

“మనం దారుణమైన ఒక ప్రమాదంలో తల్లకిందులుగా పడిపోయాం కులకర్ణీ…. కలకత్తా సమీపంలోని మన డిఫెన్స్ లేబరేటరీలో నుంచి ప్రయోగదశలో వున్న నాలుగు గ్రౌండ్ టు ఎయిర్ మిస్సయిల్స్ మాయం అయ్యాయి. అక్కడి సెక్యూరిటీ స్టాఫ్‌ని తీవ్రంగా గాయపరిచి ఎవరో ఈ దారుణాన్ని సాగించారు” కులకర్ణిగారి ఎదుట వున్న కుషన్ చైర్లో కూర్చుంటూ అలసటగా అన్నారాయన.

నోటిలోని సిగార్‌ని తీసి చేతితో పట్టుకుంటూ, శిలా విగ్రహంలా నిలబడిపోయారు కులకర్ణి.

మాయం అయ్యాయని హోమ్ మినిస్టర్ గారు చెబుతున్న మిస్సయిల్స్ ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగివున్నవో ఆయనకు తెలుసు. పడకూడని చేతుల్లో అవి పడితే జరుగబోయేదేమిటో ఊహించుకునే సరికి ఆయన నుదుటి మీద స్వేదబిందువులు ప్రత్యక్షం అయ్యాయి.

Preview download free pdf of this Telugu book is available at Ten Against Shadow