• Telugulo Maaruperu Rachaitalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగులో మారుపేరు రచయితలు

    Telugulo Maaruperu Rachaitalu

    Publisher: Palapitta Books

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పుట్టుపేర్లు వదిలి పెట్టుపేర్లతో, పొట్టి పేర్లతో సాహిత్యకారులు రచనా వ్యాసంగం చేసే సంప్రదాయం చాలా ప్రాచీనమైనది; ప్రపంచమంతటా వుంది.

కవులు, రచయితలు, విమర్శకులు తమ సొంత పేర్లను కలం పేర్ల చాటున మరుగుపరుచుకోడానికి సాహిత్య-సాహిత్యేతర కారణాలూ అనేకం. ఆ కారణాలను శాస్త్రీయంగా వివరించే గ్రంథ రచన చాలా అరుదు. విస్తృతమైన పరిశోధనానుభవం ఉన్నవాళ్ళకు మాత్రమే అది సాధ్యం. తెలుగులో ఇది తొలి ప్రయత్నం.

మారుపేర్ల వెనుక వున్న అసలు పేర్లను బహిరంగపరచే ఈ సూచీగ్రంథం రెగ్యులర్‌గా సాహిత్యం చదివే పాఠకులకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. పరిశోధకులకు, గ్రంథాలయాధికారులకు కరదీపికలా ఉపయోగిస్తుంది. తెలుగు సాహిత్యంలో లబ్ద ప్రతిష్ఠుల నుంచీ అనామకుల వరకూ దాదాపు రెండు వేల మారుపేర్ల వివరాలు పొందుపరచబడిన తొలి ప్రామాణిక గ్రంథం ఇది. ఆశ్చర్యజనకమైన ఆ వివరాలు తెలుసుకోవడంలో వొక అద్భుతానుభూతి లభిస్తుంది.

- ఎ.కె. ప్రభాకర్

Comment(s) ...

ఈ పుస్తకానికి ప్రివ్యూలో ఒక పేజీనే పెట్టి మమ్మల్ని నిరాశ పరిచారు. కవిపుంగవుల కలాల కా౦తిని కనిపించకుండా చేశారు కినిగేవారు. మమ్మల్ని కిమ్మనకుండా కూడాచేశారు. ఏమైనా స్వీయ గ్రంధాలయంలో ఉండదగినది అయి ఉండవచ్చు. రచయితల సేకరణకు ధన్యవాదాలు.
-కొత్తపల్లి రాములు, యం.ఏ. తెలుగు, (పిహెచ్.డి)