• Telugu Vyakaranam PSBH
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు వ్యాకరణం - ప్రజాశక్తి బుక్ హౌస్

    Telugu Vyakaranam PSBH

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనసులోని భావాల్ని వెల్లడించేందుకు ఉపకరించే సాధనమే భాష. మానవుడికి మాత్రమే సొంతమైన శక్తి ఇది. జంతువులు మాట్లాడలేవు. అలాగని తమ భావాల్ని వెల్లడించకుండా పోవు. అరుపులో, కిచకిచలో, ఓండ్రపెట్ట మో, గాండ్రుమనడమో ఏదైతేనేమి! చీమలు ఆహారం ఉన్న చోటుని కనుక్కొని తమ పుట్టకు తిరిగి వచ్చేటపుడు వాసన వేసే ఒక రసాయనాన్ని తోవ పొడుగునా వదులుతాయి. మిగిలిన చీమలన్నీ దాన్నే అనుసరిస్తాయి. చీమలు మాట్లాడుకోకుండనే ఈ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం లేదూ?! కాబట్టి భావప్రకటనకు భాషే అవసరం లేదు. కానీ మానవుడు అలా కాదు. భాషను రూపొందించుకొన్నాడు; సాహిత్యాన్ని సృజించుకొన్నాడు. భాషకు గల సూత్రాలను అందించేదే వ్యాకరణం. సాహిత్య సౌందర్యాన్ని వివరించేదే అలంకార శాస్త్రం.

వ్యాకరణం అనే పదం తొలిసారి గోపథం బ్రాహ్మణంలోనూ, ఆపై ముండకోపనిషత్‌ లోనూ, రామాయణంలోనూ ప్రయోగితమైంది. ప్రాచీన భారతీయ విద్యావిధానంలో వ్యాకరణ శాస్త్రాధ్యయనం ప్రధానమైంది అని పతంజలి 'మహాభాష్యం' తెలిపింది. 'వి+ఆ+కరణం' అనే పదాల కలయికతో ఏర్పడిన శబ్దమే వ్యాకరణం. వివరించి సర్వతోముఖంగా చెప్పే సాధనం అని దీనర్థం. ''వ్యాక్రియన్తే సంస్కృయన్తే అనేన ఇతి వ్యాకరణం'' అని పతంజలి నిర్వచనం. శబ్దాలు దీనివల్ల విడదీయబడతాయి కాబట్టి ఇది వ్యాకరణం అని దీని వివరణ. ''విక్షేపణ ఆకరోతి ఇతి వ్యాకరణం'' అనే వ్యుత్పత్తిని బట్టి శబ్ద వివరణకు సహకరించేది వ్యాకరణం అని స్థూలంగా అర్థం చేసుకోవచ్చు.

- ఆకెళ్ళ రాఘవేంద్ర

* * *

భాష విషయాన్ని చెబుతుంది. అదే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్తకమిది. ఈ రెండింటిలోని ముఖ్యమైన విభాగాల్ని విద్యార్థుల,భాషాభిమానుల ముందుంచే ప్రయత్నమిది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Telugu Vyakaranam PSBH