• Telugu Velugulu Telugu Varamandi
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు వెలుగులు (తెలుగువారమండీ...)

    Telugu Velugulu Telugu Varamandi

    Pages: 344
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనమంతా తెలుగువాళ్ళం. తెలుగులో పుట్టాం. పెరిగాం. కాని తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. తెలుగులో చదవలేకపోతున్నాం. ఇక వ్రాయడం సంగతి సరే సరి... తెలుగులో పట్టుమని పది వాక్యాలు కూడా వ్రాయలేకపోతున్నాం. దీనికి కారణం మనం వ్రాయలేకా, చదవలేకా కాదు. వ్రాయాలనీ, చదవాలనీ లేక. అంటే అలవాటు లేక. అలవాటు తప్పిపోవడం వల్లా, అవసరం అనిపించకపోవడం వల్ల మనం తెలుగును పట్టించుకోవటం లేదు. ఇదే నా బాధ. ఈ పుస్తకాన్ని వ్రాయడానికి గల ముఖ్య కారణం ఇదే. ఒకసారి మన భాష గురించి, మన చరిత్ర గురించి సమీక్షించుకుంటే, మనం చేయవలసినది మనకు తెలిసి వస్తుందనే అభిప్రాయంతో ఈ పుస్తకాన్ని తేవడం జరిగింది.

ఈ పుస్తకంలో తెలుగువారి చరిత్ర, తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు, శతాబ్దాలుగా వివిధ రాజవంశాల పాలనలో జరిగిన సాహితీ సేవ, వివిధ రంగాల్లో తెలుగువారి ప్రతిభా విశేషాలు వివరించబడ్డాయి. ఇందులో ప్రధానంగా తెలుగు సాహిత్యాన్ని కేంద్రబిందువుగా చేసుకొని వ్రాయడం జరిగింది. సాహిత్యంతో పాటు అనుబంధ కళలైన సంగీతం, నాటకం, జానపద కళారీతులు, పత్రికా రంగం, చరిత్ర పరిశోధన- లాంటి రంగాల గురించి, ఆయా రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైనవారి గురించి వివరించడం జరిగింది.

ఈ రచనకు తెలుగు వెలుగులు అన్నది శీర్షికగాను, తెలుగువారమండీ... అనే పిలుపును ఉపశీర్షికగాను పెట్టడం జరిగింది. తెలుగుతనాన్ని విడచిపెట్టవద్దని ఉపశీర్షిక ద్వారా అభ్యర్థన. ప్రతిభావంతులైన తెలుగువారిని పరిచయం చేయడం శీర్షిక ప్రధాన లక్ష్యం. కేవలం సాహితీవేత్తలను చెప్పి, మిగిలినవారిని విస్మరిస్తే శీర్షిక పరంగా ఈ గ్రంథం అసంపూర్ణమవుతుంది. అందువల్ల మిగిలిన రంగాల్లో రాణించి, తెలుగుజాతి ఘనతను దశదిశలా చాటిన తెలుగు తేజాల గురించి గ్రంథం చివరిలో చెప్పడం జరిగింది. ఇందులోని విషయాలు కొత్తవి కావు. మీలో చాలామందికి ఇవి తెలిసి ఉండవచ్చు. కాని ఒకే పుస్తకంలో తెలుగు భాష గొప్పదనంతో పాటు, తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన కొన్ని సాహితీ ప్రక్రియలను, సాహిత్యంలో వచ్చిన మార్పులను ముందు తరాలవారికి తెలియజేసే ఉద్దేశంతో ఈ రచన చేయడం జరిగింది.

- జె.వి.వి. సత్యనారాయణ మూర్తి

గమనిక: " తెలుగు వెలుగులు (తెలుగువారమండీ…) " ఈబుక్ సైజు 5.4mb

Preview download free pdf of this Telugu book is available at Telugu Velugulu Telugu Varamandi