• Telugu Sametalu Praja Sakti Book House
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సామెతలు - ప్రజాశక్తి బుక్ హౌస్

    Telugu Sametalu Praja Sakti Book House

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు భాషకు సంస్కృతికి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. నూట నలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్‌ ఎం.డబ్యు.కార్‌ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ‘ఆంధ్ర లోకోక్తి చంద్రిక’ పేరిట ప్రచురించారు. ఆ సామెతలకు ఇంగ్లీషులో వివరణతో పాటు సమానార్థకమైన ఆంగ్ల సామెతలు పొందు పరిచారు. తెలుగు భాష వెనక పట్టు పట్టి ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిపోతున్నదని అందరూ అంటున్న ప్రస్తుత నేపథ్యంలో అలాంటి వారికి ఇదో అదనపు ఉపయోగంగానూ భావించవచ్చు. ఇప్పటి ప్రమాణాలతో మర్యాదలతో చూసినప్పుడు ఇందులోని కొన్ని సామెతలు ఎబ్బెట్టుగానో ఇబ్బందిగానో అనిపించవచ్చు. ముఖ్యంగా స్త్రీలను, కొన్ని సామాజిక తరగతుల వారిని కించపరిచే ధోరణి వాటిలో ప్రస్పుటంగా వుంటుంది. అదే స్థాయి కింది తరగతుల వారి బాధ వేదనలు కూడ ధ్వనిస్తాయి. ఇవన్నీ కూడా సమాజ పరిణామాన్ని అర్థం చేసుకునే కోణం నుంచి అధ్యయనం చేయడం అవసరం గనక ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాం. పుస్తకం పేరులో కొంతమార్పు తప్ప మరే ప్రధానమైన మార్పులు చేయలేదని తెలియజేస్తున్నాం. ఆ ప్రచురణలోని సంసృత సామెతలను మాత్రం ఇందులో ఇవ్వలేదు. అవసరాన్ని అవకాశాన్ని బట్టి వాటిని విడిగా అందించే ప్రయత్నం చేయవచ్చు. ఈ పుస్తకం భాషా సాహిత్యాభిమానుల ఆదరణకు పాత్ర మవుతుందని ఆశిస్తున్నాం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Telugu Sametalu Praja Sakti Book House