• Telugu Nerpadam Ela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు నేర్పడం ఎలా?

    Telugu Nerpadam Ela

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏది సరైనదైతే అదే మంచిది!

తెలుగు చదివే పిల్లలు ఇప్పుడు చాలా తగ్గిపోతున్నారు. కానీ ఎంత తగ్గినా, ఈ నాటికీ ఇంకా 'తెలుగు బడులు' బతికే వుంటున్నాయి. ఆ బడుల్లో పేద పిల్లలు తెలుగే చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు? 10వ తరగతి పిల్లలు కూడా అక్షరాలు తప్పులు లేకుండా రాయలేరు.

చదువులు ఇంత కన్నా సరి గానూ, ఇంత కన్నా త్వరగానూ నేర్పలేమా? సాధ్యం కాదా? అలా ఎందుకు చెయ్యలేక పోతున్నాం? కారణాలు ఏమిటో చూడాలంటే, 'ప్రారంభం'లోకి వెళ్ళాలి. అంటే 'ఒకటో తరగతి' లోకి! అదే పునాది! అక్కడ కనపడే ప్రధానమైన కారణం - 'తప్పుల తడకల తెలుగు వాచకం!'. టీఛరు శ్రద్ధగా చదువు చెప్పాలంటే 'వాచకం' సరిగా వుంటేనే అది సాధ్యం.

50, 60 ఏళ్ళ నాటి ఒకటో తరగతి వాచకాల్ని తీసుకుంటే, వాటిలో కూడా కొన్ని పొరపాట్లు వున్నా, చదువు నేర్పే క్రమం అంతా వాటిల్లో సరైన పద్దతిలోనే వుండేది. మొదట 'అక్షరమాల'ని చూపించి, తర్వాత మాటలూ, ఆ తర్వాత వాక్యాలూ చెప్పే క్రమం అది. 'మాటలు' నేర్చుకోడంలో కూడా, ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క అచ్చు శబ్దాన్ని, గుణింతం గుర్తుల్లో నించి ఒక్కొక్క గుర్తునీ నేర్చుకుంటూ వెళ్ళే క్రమం అది. కానీ, క్రమ క్రమంగా ఆ సరైన పద్ధతికి బదులు, 'నూతనత్వం' పేరుతో, మొట్టమొదటే కవిత్వాల్నీ, వాక్యాల్నీ చూపించి, ఆ వాక్యాల్లో వున్న అక్షరాలతో మాత్రమే వచ్చే మాటల్ని నేర్పే తప్పుడు పద్ధతి పుట్టుకొచ్చింది. అంతే కాదు, అక్షరాల్ని, వాటి ఆకారాల్ని బట్టి కొన్ని భాగాలుగా విభజించి, ఒక్కొక్క భాగంలోకి వచ్చే అక్షరాలతో మాత్రమే మాటలు చెప్పే వికృత పద్ధతి కూడా తలెత్తింది. సరైన పద్ధతిని వదిలేస్తే, ఆ తర్వాత ప్రారంభించే ఏ పద్ధతైనా తప్పుడు పద్ధతే అవుతుంది. దాని వల్ల చదువు నేర్పడంలో అనేక సమస్యలు పుట్టు కొస్తాయి.

కొన్ని ప్రభుత్వ వాచకాలూ, కొన్ని ప్రైవేటు వాచకాలూ 'కొత్తదనాల' పేరుతో అనేక తప్పుడు పద్ధతులతో కిక్కిరిసి పోయి వున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చేసుకోవాలసిన మార్పు ఏమిటంటే, మళ్ళీ వెనకటి మంచి పద్ధతులనే అనుసరించడం. ఏది సరైన దైతే అదే మంచిది. సరైన దాన్ని ఇక మార్చ నక్కర దు. సరైన దాన్ని ఏ మాత్రం మార్చినా అది మళ్ళీ సరికాని విధానం అయి పోతుంది.

చదువు ప్రారంభించడానికి ఈనాడు పుట్టుకొస్తున్న రక రకాల కొత్తదనాల వల్ల, ఒక అతి ప్రధానమైన ప్రశ్న తలెత్తుతోంది. అదేమిటంటే, చదువు నేర్పడం - 'అక్షరాలూ - మాటలూ - వాక్యాలూ' క్రమంలో జరగాలా, లేకపోతే 'వాక్యాలూ - మాటలూ - అక్షరాలూ' అనే క్రమంలో జరగాలా? వీటిలో, ఏది సరైన క్రమమో తేల్చుకుని, దాన్ని స్థిరపర్చుకుంటే తప్ప, ఒకటో తరగతి వాచకాలు గానీ, వయోజన వాచకాలు గానీ, విద్యార్థులకు ఉపయోగపడే పద్ధతిలో తయారుకాలేవు.

Preview download free pdf of this Telugu book is available at Telugu Nerpadam Ela