• Telugu Nene Velugu Nene Teguloo Nene
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు నేనే - వెలుగు నేనే - తెగులూ నేనే...!

    Telugu Nene Velugu Nene Teguloo Nene

    Pages: 352
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన అందరికోసం, తెలుగువాళ్లందరి కోసం, ఆంధ్రులయిన యావత్తు తెలుగుజాతికోసం, వారి అభివృద్ధికోసం, అభ్యుదయ పరంపరాభివృద్ధికోసం; దాదాపు మూడువేల సంవత్సరాల లిపి, శాసనాల, నాణాల, చారిత్రక, సారస్వత, సాంస్కృతిక పునాదులుగల తెలుగువారందరి ఐక్యతకోసం - ఒక్క ముక్కలో చెప్పాలంటే, పరాయి పాలకుల కింద ఛిన్నాభిన్నమైపోయిన తెలుగుప్రాంతాలు, తెలుగు ప్రజలు పరాయి పంచలలో బతుకులీడ్చిన దుర్దినాలు మినహాయిస్తే ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల ఏలుబడిలో యావత్తు తెలుగువారి ప్రాంతాలూ ప్రజలూ ఒకే పాలనలో, ఒకే గొడుగు కింద వెలుగొందిన శుభఘడియలను మరొక్కసారి గుర్తు చేసుకోవడం కోసమే ఈ పుస్తక రచన, అనుబంధాల సంకలనమూ!

ఈ ఘన చరిత్ర తెలియని తెలుగువాడిని, దారి తప్పిన శక్తులేవో నడిపిస్తే నడిచి తన జాతి చరిత్రకే చిచ్చుపెట్టుకుంటూ పక్కతోవలలో ప్రయాణిస్తున్న తెలుగువాడిని నాలోనే చూసుకుని నన్ను నేను సరిదిద్దుకోడనికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం! అందుకే తెలుగు ఆధునిక మహాకవులలో ఒకరైన మన తెలంగాణా బిడ్డ దాశరథి కృష్ణమాచారి కవితలోని మొదటి రెండు చరణాయిలన ''తెలుగు నేనే / వెలుగు నేనే'' పంక్తులకుతోడు, చెడిపోతున్న తెలుగువాడిని నాలోనే ఆవహింపజేసుకుని ఆ మకుటానికి నా ఆవేదనగా ''తెగులూ నేనే!'' అని మరో పంక్తి చేర్చాను!

''తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌'' అని శ్రీ కృష్ణ నివేదిక సమర్పణకు నాలుగు నెలల ముందుగానే అచ్చయిన నా పుస్తకానికి కొనసాగింపుగానే అనేక అంశాలు, వివరణలతో, అనుబంధాలను కూడ జతచేర్చి ఈ కొత్త పుస్తకాన్ని ''తెలుగు నేనే - వెలుగు నేనే - తెగులూ నేనే!'' గ్రంథాన్ని మానవతావాది, తెలుగు వెలుగైన మండలి కృష్ణారావుకు స్మృత్యంజలిగా అంకితమిస్తున్నాను.

- డా. ఎ. బి. కె. ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Telugu Nene Velugu Nene Teguloo Nene