• Telugu Natakarangam Janapada Kalaaroopaalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు నాటకరంగం జానపద కళారూపాలు

    Telugu Natakarangam Janapada Kalaaroopaalu

    Pages: 388
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన తెలుగు నాటకరంగాన్ని, కొన్ని జానపద కళలను పరిచయం చేస్తూ ఆ జానపద కళారూపాల ద్వారా నాటకం శక్తిమంతంగా చిక్కబడిన తీరును డా. చిట్టినేని శివకోటేశ్వరరావు ఈ గ్రంథం ద్వారా విశదీకరించారు. అలాగే జానపదకళారూపాలు ప్రజానాట్యమండలి వంటి సంస్థల ఆధ్వర్యంలో చైతన్యవంతమైన ప్రజాకళారూపాలుగా మారిన వైనాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో సమకాలీన రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలను ఆ కళారూపాలు ఎంత శక్తిమంతంగా చర్చించాయో, ప్రజల్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించారు.

ప్రజాకళా సైనికుడు సఫ్దర్ హష్మి మార్గంలో ప్రజానాట్యమండలి, ఆధునిక వీధినాటకంలో సందర్భోచితంగా జానపద కళారీతుల్ని చొప్పించి, అటు నాటకాన్నిసుసంపన్నం చేయడంతో పాటు, ఇటు ప్రేక్షకుల్ని పోరాటపథాన నడిపించిన తీరును సోదాహరణంగా వ్యక్తపరిచారు. వీధినాటిక విస్తృతి అనంతం. చర్చించని అంశం ఉండదు, రాకూడని పాత్ర ఉండదు. పామరుడి నుండి ప్రధానమంత్రి వరకు ఎలాంటి ముసుగు లేకుండా పాత్రోచితంగా రంగప్రవేశం చేస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛకు ఎంతటి అవకాశం ఉందో, అంతటి అవకాశన్ని సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ప్రజలకు సులువుగా చేరవేయడానికి అప్పుడు జానపద కళలే దిక్కు అవుతాయి - ఎలా అనేది ఈ పుస్తకంలో ఉంది.

- కె. శాంతారావు

Preview download free pdf of this Telugu book is available at Telugu Natakarangam Janapada Kalaaroopaalu