• Telugu Cinema 1961 2011
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సినిమా 1961-2011

    Telugu Cinema 1961 2011

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిత్రరంగంలో కొందరు పేరుతో, మరికొందరు ఇంటిపేరుతో, కొందరు తొలుత నటించిన సినిమా పేరుతో పాపులర్‌ అవుతారు. చక్కని నటనతో, డైలాగ్‌ డెలివరీతో సహజ నటిగా గుర్తింపు పొంది, ప్రస్తుతం సికిందరాబాద్‌ ఎం.ఎల్‌.ఎగా వున్న జయసుధను నాయికగా తన తొలిచిత్రం 'లక్ష్మణరేఖ'తో ధైర్యంగా పరిచయం చేసిన దర్శకుడు నిట్టల గోపాలకృష్ణ. ఆ సినిమా హిట్టయ్యాక ఆయన 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అయ్యారు.

1961 నుంచి చిత్రరంగంతో విశేష అనుబంధం, అనుభవం ఉన్న ఎన్‌.గోపాలకృష్ణతో ఆంధ్రప్రభ గురువారం అనుబంధం 'చిత్రప్రభ'కి ఫీచర్‌ రాయిస్తే బావుంటుందని నా సహచరుడు వి.ఎస్‌. కేశవరావ్‌ సూచించినప్పుడు వెంటనే సరే అన్నాను. 'డైరెక్టర్స్‌ స్పెషల్‌' శీర్షికను 27 నవంబర్‌ 2008 సంచిక నుంచి ప్రారంభించాం. పన్నెండు పదిహేను వారాలు మాత్రమే ఈ ఫీచర్‌ ఆయన నిర్వహిస్తారని నేను భావించాను. అయితే, 22-4-2010 వరకు అంటే 73 వారాలపాటు (ఇంచుమించు ఏడదిన్నర) కొనసాగించారంటే ఆ శీర్షికకు పాఠకుల నుంచి వచ్చిన విశేష స్పందనే కారణం.

సినిమారంగంలో బి.నాగిరెడ్డి నుంచి పలువురు నిర్మాతలతోను, ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, గుమ్మడి, సావిత్రి, ఏఎన్‌ఆర్‌, అంజలీదేవి, జమున, కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖ నటీనటులతోనూ, బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి వంటి దర్శకులతో వున్న పరిచయాలు, ఈయన గురువులైన తాపీ చాణక్య, కమలాకర కామేశ్వరరావు, వి.మధుసూదనరావు వంటి దర్శకులతో వున్న అనుబంధం వల్ల సినీ స్వర్ణయుగంలోని వారి అనుభవాలు, విశేషాలు రాయడంతో ఆ విశేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

చిత్రప్రభలో ప్రచురితం అయిన 'డైరెక్టర్స్‌ స్పెషల్‌' ఒక సంకలనంగా తెస్తే బావుంటుందని పాఠకులు సూచించారు. వారి సూచన శిరోధార్యం అనడంతో ఈ పుస్తకం రూపుదిద్దుకొంది.

సినిమా విశేషాలపై ఈ మధ్య అనేక పుస్తకాలు వస్తున్నాయి. వీటికి రీడర్స్‌ కూడ పెరిగారు. అందుకే ఈ 'తెలుగు సినిమా' 1961-2011 (సిని'మా' యుగంలో స్వగతాలు) పుస్తకం ఒక మంచి సమాచారం అందించే గ్రంథంగా సినిమా పాఠకుల్ని అలరిస్తుందని విశ్వాసం.

- పి. విజయబాబు, ఎడిటర్‌, ఆంధ్రప్రభ దినపత్రిక

Preview download free pdf of this Telugu book is available at Telugu Cinema 1961 2011