• Telugu Bhashaku Pracheena Hoda Takshana Kartavyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగుభాషకు ప్రాచీన హోదా తక్షణ కర్తవ్యం

    Telugu Bhashaku Pracheena Hoda Takshana Kartavyam

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కేంద్రప్రభుత్వం 'తెలుగుభాష'కి ప్రాచీనహోదా కల్పించడం ఓ వరం అయితే అవొచ్చు. అయితే మాత్రం, దీనిని చూస్తూ మురిసిపోవడమే కాదు, ఆ వరాన్ని మనం సద్వినియోగ పర్చుకొని కాపాడుకోవాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది. దీనికి మన రాష్ట్రప్రభుత్వం చేపట్టవల్సిన తక్షణ కర్తవ్యాలు, అవి అమలుపరచడంలో అధికారులు తీసుకోవల్సిన తక్షణ చర్యలు, ప్రజలను జాగృత పర్చడంలో ఉపాధ్యాయులు, సాహితీ సంస్థల పాత్రలు ..... ఇత్యాది విషయాలపై చర్చ జరుగవలిసి ఉన్నది. చర్చ జరగడమే కాదు, ఆంగ్లభాషా వ్యామోహంలో ఉన్న మనం ఏం కోల్పోతున్నామో ప్రజలకు కళ్లకు కట్టినట్లు విపులీకరించి జాగృతపర్చవలసిన తక్షణ అవసరం ఈనాడు విజ్ఞులైన అందరిపై ఉన్నది. ''ఎవరో వస్తారని... ఏదో చేస్తారని...'' అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్క తెలుగువాడూ తనవంతు సాయంగా భాషకోసం ఉద్యమించ వల్సిన తరుణం ఆసన్నమైనది. మన ప్లిలలకి.. తదుపరి తరానికి మన తెలుగుభాష తియ్యని ఫలాలని అందించేందుకు మనమిప్పుడు నడుంకట్టి తెలుగుభాషను రక్షించుకునేందుకు ప్రతిన బూనవలసిన అవసరం మనపై తక్షణమున్నది.

దీనిలో భాగంగా 'రమ్యభారతి' సాహిత్యత్రైమాస పత్రిక, చెన్నైలోని 'జనని' సాంఘిక సాంస్కృతిక సమితి సంయుక్తంగా 'తెలుగుభాషకు ప్రాచీనహోదా- తక్షణ కర్తవ్యం' అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. రాష్ట్రంనుండే కాక, పొరుగు రాష్ట్రాలనుంచీ అధిక సంఖ్యలో వ్యాసాలు పోటీకి వచ్చాయి. వీటి రచనలో వేటికవే గొప్పదనం కలిగివున్నవే! వేటికవి ప్రత్యేక అంశాలతో , విశ్లేషణలతో సాగినవే.

ఈ పోటీలకొచ్చిన వ్యాసాలలోని సారాంశం, తెలుగు భాషాభివృద్ధికి రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సూచనలు ప్రజలలోకి మరింత బలంగా తీసుకుపోయి ఉదృతరూపంలో ఉద్యమం నడిపించే దిశగా గ్రంథస్తం చేయాలనే ఆలోచన ఈ పుస్తకం మీ ముందుంచడానికి కారణమయ్యింది. ఈ సంకలనంలో రచయితలు వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సూచనలు తెలుగుభాషాభివృద్ధికి ఎంతగానో దోహదపడగలవని మా గట్టి విశ్వాసం. చంద్రునికో నూలు పోగులా మావంతు చేస్తున్న కృషి మాత్రమే ఇది. తెలుగుభాషను దక్కించుకోవడానికి మనం చేపట్టవలసిన 'తక్షణ కర్తవ్యాలను' ఈ పుస్తకంలో పొందుపరచబడిన అంశాలను చదివి ఆచరించేందుకు ప్రయత్నిస్తే కొంతవరకు మా ప్రయత్నం సఫలీకృతమైనట్లే.

- చలపాక ప్రకాష్‌

Preview download free pdf of this Telugu book is available at Telugu Bhashaku Pracheena Hoda Takshana Kartavyam