• Telangana Rekkalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ రెక్కలు

    Telangana Rekkalu

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ
మట్టిపై
మమకారం ఉన్న
ప్రతి ఒక్కరికి
ఆదరించే అమ్మ
తెలంగాణ !'
అంటూ తెలంగాణ మట్టిపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తూ సబ్బని వెలువరించిన పుస్తకం ఇది.

“ 'తెలంగాణ రెక్కలు' కృతిలో ఆరు పంక్తుల్లో తెలంగాణ స్వరూపాన్ని ఉత్తేజకరంగా ఉల్లేఖించారు” అని సబ్బనిని ప్రశంసించారు ప్రసిద్ధ కవి డా.సి. నారాయణ రెడ్డి గారు తన ముందు మాటలో.

రెక్కల రూపశిల్పి ” M.K. సుగంబాబు గారు సబ్బని “ తెలంగాణ రెక్కలు” నిలువెత్తు సత్యదర్పణం అని ప్రకటిస్తూ, ‘ సత్య శోధనే రెక్కలు ప్రక్రియ లక్ష్యం. ఆ సత్య శోధనలోంచే, ఆ లోతుల్లోంచి తాత్విక చింతనకు మార్గం ఏర్పడుతుంది. కవిమిత్రుడు సబ్బని లక్ష్మీనారాయణ సత్య ప్రేమికుడు. ఈయన తన రెక్కలకు ఆధారం చేసుకున్న విషయం (subject) తెలంగాణ. ఇవాళ తెలంగాణా లక్ష్యం ప్రత్యేక కాగా, సబ్బని తన రెక్కల్లో తెలంగాణ ఆర్తిని, ఆకాంక్షను, ప్రస్పుటం చేసిన తీరు, ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని వ్యక్తం చేసిన విధానం అపూర్వం.’ అన్నారు.

ఇంకా "ఒక చారిత్రాత్మకమైన మలుపులో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి, గళం విప్పి, వారి ఆకాంక్షలను ‘రెక్కలు’గా గానం చేసిన సబ్బని బహుదా ప్రశంసనీయుడు, ఇది ఉత్తమ కావ్యం, నిలువెత్తు సత్య దర్పణం.” అని శుభాకాంక్షలు తెలిపారు సుగంబాబు గారు.
‘నిప్పు
రాజుకుంది
ఎవరాపుతారు
చేతులడ్డంపెట్టి?
తెలంగాణ
అగ్నికణం.'
ఇలాంటి ఆరారు లైన్లలో తెలంగాణ గురించి అర్థవంతమైన నూరు రెక్కలున్నపుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Rekkalu
Comment(s) ...

Six lines little poems on Telangna . Telangana Rekkaalu.,composed on the life of Telangana reflecting the present situation with depth meaning searching the truth