• Teeyani Chuttarikam
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తీయని చుట్టరికం

    Teeyani Chuttarikam

    Author:

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటం - తీయని చుట్టరికం (వింధియా కథలు) - పూర్తి అవడంతో నలబై కథలు తమిళంలో నుంచి తెలుగులో అనువదింపబడి e-books గా వెలుబడ్డాయి.

ఈ సమయంలో నాకు వింధియా సాహిత్య ఉద్యమం, రచనావిశేషం, నాకు మా అక్కయ్య సాహిత్యంలోని అభిరుచి - వీటి గురించి కొన్ని కబుర్లు చెప్పాలని ఉంది.

వింధియాకి సంతానం లేదు. ఆవిడ రచనలన్నిటినీ సేకరించి, ఒక స్మారక చిహ్నంగా వింధియా - సమగ్ర సాహిత్యం - అనే గ్రంథం ప్రచురించాలని మేం - Prof. K.N. సుందరేశన్ కుటుంబ సభ్యులు - నిశ్చయించాం. "

ఈ ప్రచురిత గ్రంథం మూలంగా మా బావగారు Prof. V. సుబ్రహ్మణ్యంగారి కోరికకూడా నెరవేరుతుందనే తృప్తి నాకు కలుగుతోంది. వింధియాకి సిద్ధించిన సాహిత్య కీర్తికి ఆమె భర్తకూడా దోహదం చేసారు. 1997లో అక్కయ్య సెల్వి విశ్వనాధన్ కటకంలో అతన్ని కలుసుకున్నప్పుడు బావగారు రాబోయే తరాలకి వింధియా రచనలు అందినట్టు మేమేమైనా చెయ్యాలని తన అభిలాష తెలియజేసారు. దానితో బాటు వింధియా రాసిన ఒకే ఒక నవలని సెల్వికి ఇచ్చి దాన్ని ప్రచురించమన్నారు. సుదందిరప్పోర్ అనే పేరుతో ఆ నవల 2012లో వెలుబడింది; 2015లో Kurinji Website లో దాన్ని చేర్చడమైంది. ఆ తరువాత రాజేశ్వరి అనే పేరుతో దాని ఇంగ్లీషు (2014), తెలుగు (2018) అనువాదాలు వచ్చాయి.

ఇక రచయతల మాటకొస్తే వాళ్ళ జీవితం మనకి సాధారణంగా కనిపించవచ్చు. కాని సామాన్య ప్రజల సాంసార ఘటనలని ఆరసించి తన కల్పనాశక్తి, నవీకరణ మూలంగా రచయతలు కథలని సృష్టించడం మనం చూస్తాం. అక్కయ్య ఇందియా 'వింధియా' అనే పేరుతో రాసిన కథలు కూడా అలాగే రూపొందాయి. మాది తమిళ కుటుంబం, కాని ఆవిడ చదువంతా తెలుగు మాధ్యంలోనే జరిగింది. ఇంటిలో మా నాన్న గారి ప్రేరేపణతో తమిళ బాషలో రాయడం, చదవడం నేర్చుకున్నారు. అదే తన రచనలకి అవలీలగా ప్రయోగించారు. తన పదహారో వయసులో పెళ్ళైన తరువాత ఆవిడ ముందు దక్షిణ దేశంలోనూ, ఆ తరువాత కటకంలోనూ స్థిరపడ్డారు. ఆవిడ కధల్లోని పాత్రలందరూ సామాన్య ప్రజలే; ఇతివృత్తాలకి ఆధారం సామాన్య, సాంసారిక ఘటనలు. పెద్ద సంఘర్షణలు, పోరాటాలని కనిపించకపోయినా ఈ కథల్లో పాత్రలలో మానసిక లో చూపు, వారి చిత్రీకరణ, మనం చూస్తాం.

- ఎండీ సుందరేశన్

Preview download free pdf of this Telugu book is available at Teeyani Chuttarikam