• Talli Chepa
  • Ebook Hide Help
    ₹ 252
    280
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తల్లి చేప

    Talli Chepa

    Author:

    Publisher: Perspectives

    Pages: 431
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1983 నుంచి 85 దాకా తెలంగాణలో నిర్మాణమైన ప్రజల పోరాట చరిత్రను సజీవంగా మన కళ్ళ ముందు నిలిపిన సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక చరిత్రే ఈ కథలు. ఒక నిర్దిష్ట స్థలకాలాల సామాజిక పరిణామక్రమాన్ని ఈ కథలు వ్యాఖ్యానిస్తాయి.
తెలంగాణలో అతి పురాతన భూస్వామిక సమాజాన్ని కదిలించి నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా ప్రజలు ఎదిగిన క్రమమే రాజయ్య కథలు, నవలలు. ఈ కథలు పాదుకొల్పిన చైతన్యం ఇప్పటికైతే నివురుగప్పిన నిప్పే కావచ్చు.
అది ర గు లు తూ నే ఉంటుంది.
రాజయ్య రచనలు ఇవ్వాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేస్తాయి. అది కొద్దిమంది బంగారు తెలంగాణగా కాక, బడుగు బతుకులకు భూమి భుక్తిలతోపాటు సమస్త పీడనల నుంచి విముక్తినిచ్చే బతుకు తెరువు తెలంగాణగా మారాల్సిన క్రమాన్ని రాజయ్య కథలు వివరిస్తాయి. పాలకులకు అణచివేత విధానాలున్నట్లే, పోరాడే ప్రజలకు వాటిని ఎదురించే మార్గాలు ఎలా ఉంటాయో ఈ కథలు చెబుతాయి.
భూమి చేజారిన రైతుల బతుకులు ఎంతటి విధ్వంసానికి గురయ్యాయో, ఎంతటి వెట్టిబతుకులుగా మారాయో అనితరసాధ్యంగా రాజయ్య చిత్రిస్తాడు. తమని తాము విముక్తి చేసుకునేందుకు పెట్టుకున్న రైతు కూలీ సంఘాలపై రాజ్యం ఉక్కుపాదం మోపినా... వెన్ను చూపని ప్రజల విజయాల అపజయాల వెతల బతుకుల పోరాట చిత్రమే ఈ తల్లి చేప కథలు.

- ఆర్ కె
పర్‌స్పెక్టివ్స్

గమనిక: " తల్లి చేప" ఈబుక్ సైజు 13.4 mb
Preview download free pdf of this Telugu book is available at Talli Chepa