• Tallapaka Sahityamlo Kavisamayalu
  • Ebook Hide Help
    ₹ 90
    180
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు

    Tallapaka Sahityamlo Kavisamayalu

    Publisher: Sarada Prachuranalu

    Pages: 348
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. జి. ఉమాదేవిగారు నాకు పదేళ్ళుగా పరిచితులు. నా పర్యవేక్షణలో ఎం.ఫిల్, పిహెచ్.డి. పరిశోధన సాగించినారు. వీరి పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం, “తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు” అచ్చులోకి రావడం ఆనందించదగ్గ విషయం.

ఈ మధ్య చాలామంది దృష్టి తాళ్ళపాక సాహిత్యంపై పడడం హర్షించ దగ్గ అంశం. అయితే వాటిలో చాలా రచనలు ఈత లాంటివే. మునిగి వెలికి తీసిన రత్నాలు కావు. డా. ఉమాదేవిగారి పరిశోధన చివరి కోవకు చెందిన రచన.

'కవి సమయాలు' సాహిత్యానికి సంబంధించిన పరిభాష అని కొందరి అభిప్రాయం. ఇది భాషాగతమయిన పరిభాష అని మరి కొందరి భావం. ఏది ఏమయినా ఈ పరిభాష పాతది. సంస్కృత లాక్షణికులు పరిశీలించి పెద్ద పీట వేసిన పరిభాష సాహిత్య సిద్ధాంతాలలో మార్పు వచ్చినట్లే కవి సమయాల - లక్షణాలలో సమన్వయాలలో చాలా మార్పులు వచ్చాయి. వినూత్న ఉపమాలను కూడా కవి సమయాలుగా చెప్పడం ఇందులోని ప్రత్యేకత.

తాళ్ళపాక కవులు ‘ఉభయ కవులు'. అంతేకాదు పండితుల్ని పామరుల్ని తమ రచనలతో ఆకట్టుకున్న నేర్పరులు. పామరుల్ని రంజించడానికి వారెన్నుకున్న 'ఉపమాసామగ్రి'. ఆకాశంలోని నక్షత్రాలంత ఇవన్నీ భావుకతకు పట్టని దర్పణాలు, ఉదాహరణకు పాదాలను తామరతో పోల్చడం తెలిసిన విషయమే గాని తులసీదళం, చింతకొమ్మ, తేప, పరశు, నొగలు లాంటి వాటితో పోల్చడం కొత్త పద్ధతి. తొడలను 'అరటి' తో పోల్చడం పాతకవి సమయం. అయితే తాళ్ళపాక కవులు తేరు, పట్టెమంచం, యుగాలు, కొలువు కూటం లాంటి వాటితో పోల్చారు. నాభిని పాదులో, సురపొన్నతో, సరసుతో, గుహలో గుంతపోకలతో పోల్చడం మరో ప్రత్యేకత...

సామాన్య విషయాలను కవి సమయాలుగా మలచుకోవడం తాళ్ళపాక కవులకే తెలుసు. నూగారును చీమల దొంతరతో పోల్చడం, నాచుతో ఉపమించడం, పొగ బాణమనడం, కుంచేగా కనిపించిందనడం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. జడలను కొడవళ్ళుగా, చింతకాయలుగా, తరటుగా ద్రోణంగా తీర్చడం వీరికే తగు. ఈలాంటివి వందలు వేలు. డా. జి. ఉమాదేవిగారు తాళ్ళపాక సాహిత్యాన్ని అనేకమార్లు చదివినవారు. అవగాహన చేసుకున్నవారు. తాను అర్థం చేసుకున్న దానిని సప్రమాణంగా సరసంగా చెప్పగలిగినవారు. అంచేతనే ఈ సిద్ధాంత గ్రంథం పరీక్షకుల్ని ఆకట్టుకుంది.

- కె. సర్వోత్తమ రావు

Preview download free pdf of this Telugu book is available at Tallapaka Sahityamlo Kavisamayalu