• Swechchakai Tapinchina Jagaduruvu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 56
    70
    20% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వేచ్ఛకై తపించిన జగద్గురువు

    Swechchakai Tapinchina Jagaduruvu

    Pages: 171
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎదగని మనసు ఏ మహనీయుడి వాక్యాలనూ అర్థం చేసుకోగలిగి లేదు. అక్కడ ఆ ఎత్తైన పర్వతం మీద నుండి, అనగా అంత ఎత్తుకు ఎదిగిన మనిషి చెప్పే మాటలు, మనమీ భూమిపై నుంచొని విందామనుకున్నప్పుడు, మన అల్పమైన మందకొడి మనస్సుకు, అది ఎలా అర్థమవుతుంది? మనమా కొండమీదికి ఎక్కడనికి నడుం బిగించాలి. మనం కూడ అతనిలాగా అంత ఎత్తుకు ఎదగాలి. అంతేగానీ, ఆ ఎదిగిన మనిషి సత్యాన్ని కిందికి తీసుకువచ్చి నీకు అందించగలిగి లేడు.

సత్యమెఱిగిన వాడు దానిని మాటలలో ప్రకటించమే అమిత కష్టం. అదైనా స్పష్టంగా చేయలేడు. కారణం, సత్యం మాటల్లో ఇమడ్చగలిగింది కాదు. నిర్వచించ గలిగింది కాదు. వర్ణించగలిగింది కాదు. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు కీర్తనలో లిఖించినట్లు, 'అది పలుకుల కందేది కాదు; భావాన్ని కలచిపోతుంటుంది; ఒక్క పరమ సమాధిలయంలో మాత్రమే, పలుమరు తోస్తుంటుంది.'.

మహానుభావులైనవారు, తాము స్పష్టీకరించ గలిగిన మేరకే చేస్తారు. ఇక దానిని అందుకొనడనికి మన మనసు ఎదగాల్సి ఉంటుంది. అంటే ఈనాటి మన తెలివితక్కువను, మందమతి తనాన్ని వదిలించుకుని తెలివిగానూ, ఉజ్జ్వలమతిగానూ రూపొందాలి; ఇది సాధ్యమవాలంటే మనలో నెలకొని ఉన్న 'తెలియని తనాన్ని' స్పష్టంగా చూడగలిగి ఉండాలి. అంతేగానీ, 'ఫలాని శాస్త్రం నేను చదివాను కాబట్టి నాకిప్పటికే ఏదో తెలుసు' అని అనుకుంటే, ఇది అడ్డంకిగా పరిణమిస్తుంది. గ్రంథాల ఆధారంగా సాధించిన పాండిత్యం యావత్తూ ఇలాంటి అవరోధమే. స్వానుభవంలో నేర్చింది మాత్రమే 'తెలిసినట్లు'. అందువల్ల ఇప్పుడు తెలిసినట్లు కనిపించేది, అనగా వారూవీరూ భగవంతుణ్ణి గురించి చెప్పగా విన్నది, రచించగా చదివినది, ఆ మొత్తం 'జ్ఞానాన్ని' వదిలించుకోవాలి. అంటే, మనసు పూర్తిగా ఖాళీ అయితేనే, 'తెలియ' నారంభిస్తుంది. అదే, ఎదగనికి పూర్వరంగం సిద్ధం చేయడమంటే. అలా ఎదిగిన మనిషికీ, అలా లోలోన శూన్యమయిన వానికే, ఆ మహానుభావులు చెప్పే విషయమర్థమవుతుంది. లేనిపక్షంలో, అపార్థాలూ, విపరీతార్థాలు మిగులుతై.

Preview download free pdf of this Telugu book is available at Swechchakai Tapinchina Jagaduruvu