• Swayam Prakaasam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వయం ప్రకాశం

    Swayam Prakaasam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయిత విహారి గారి విశ్లేషణ
కథానికలో క్లుప్తతకు పట్టం కట్టడం తేలికైన విషయమేమీ కాదు. అదీ ఈమె కలం బలం. స్త్రీ చిత్తం - కేంద్ర బిందువుగా సాగే కథానికలు చాలా వున్నాయి వీరి సంపుటంలో. ప్రతి కథలోనూ అంతర్నాదంగా మానవ మనస్తత్వ వైచిత్రి ధ్వనిస్తూ వుంటుంది. సాధారణ రచయితలకి లొంగని సున్నిత భావనాశ్రయమైన ఇతివృత్తాల్ని రాధిక గారి కలం కన్ను నిశితంగా చూస్తుంది. ఆ ఇతివృత్తాల్ని ఆశ్రయించుకుని సాగే కథాంశాల్లోని పాత్రలు - విలక్షణమైన ప్రవర్తనలతో నమూనా మనుషులుగా దర్శనమిస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. 'భార్యత్వం' (కథానిక పేరు అదే!) గురించి ఎంతగా తరచుకుంటూ పోతే అంత దుఃఖ భాజనమైన అనుభవాల రాశే మనముందు నిలుస్తుంది. చూడండి. "ఆమె అతని బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నిస్తే గయ్యాళి అన్నాడు. ప్రేమతో ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వగలాడి అన్నాడు. అతని మీద ఆధారపడితే చవటవన్నాడు. స్వతంత్రించి తన పని తను చేసుకుంటే నెరజాణవంటున్నాడు." ఇదీ విషయం. కథ అర్ధమయిపోతోంది కదా. కథానిక లో రచయిత్రి రచనా నైపుణ్యం ఈ విశ్లేషణ ద్వారా అందుతోంది. అలాగే, "ఈర్ష్య" అనే అద్భుతమైన కథానికని రాశారు రాధిక గారు. ఆ కథానిక ఎంతో గంభీరమైన సంఘటనాత్మకమైన రచన. చదువరికి ఆలోచనల్నిస్తుంది. "ఈర్ష్యని జయించడమంటే ఈర్ష్య పడకపోవడమే కాదు. ఈర్ష్యకి భయపడకపోవడం కూడా" అనే తీర్పునిస్తుందీ కథ. కారణం? 'సాధించుకున్న వాటి పట్ల వున్న సంతృప్తి ' దాన్ని ఈర్ష్య లేని గుణంగా ఎందుకు తీసుకోవాలి. దాన్ని పనికిరాని తనంగా పరిగణించవచ్చా? ఇదీ చర్చ. కథానికా శిల్పంతో బలంగా తన దృక్కోణాన్ని చూపిన రచన.

Preview download free pdf of this Telugu book is available at Swayam Prakaasam