• Swastik English Grammar
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Swastik English Grammar

    Swastik English Grammar

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 750
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత కొన్ని దశాబ్దాలుగా విజ్ఞాన,శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజ్ఞానాభివృద్ధి ఉరకలు వేస్తున్నది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లీష్‌ భాషలో ప్రచురించబడుతున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీ.శ 1961వ సంవత్సరంలో పేర్కొన్నట్లు ''శాస్త్ర సాంకేతిక, మానవ, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అపారమైన విజ్ఞాన ధనాగారాలు తెరచుటకు ఇంగ్లీష్‌ ఒక తాళం చెవి''. ఇంగ్లీష్‌ నుండే వివిధ విజ్ఞాన గ్రంథాలు మన దేశ భాషల్లోకి తర్జుమా చేయబడుతున్నాయి.

ఇంగ్లీష్‌ మన దేశంలో లైబ్రరీ భాషగా ఉంది. ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో సుమారు 2 లక్షల గ్రంథాలు, సరాసరిన ఒక్కొక్క కాలేజీలో 25వేల గ్రంథాలు ఉంటున్నాయి. వాటిలో 80 శాతం పుస్తకాలు ఇంగ్లీష్‌లోనే ఉంటున్నాయి. వివిధ భాషలకు నిలయమైన మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ఇంగ్లీష్‌ ఒక అనుసంధాన భాషగా ఉపయోగపడుచున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు, న్యాయస్థానాల్లోను, న్యాయశాఖా వ్యవహారాల్లోను ఇంగ్లీష్‌ కొనసాగుతూనే వుంది. వాణిజ్య సంస్థల్లోను ఇంగ్లీష్‌ భాష వ్యావహారిక భాషగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ఉద్యోగాలలోని నియామకాలకు జరిగే పోటీ పరీక్షలు సైతం ఇంగ్లీష్‌లో నిర్వహింపబడుతున్నాయి.

దేశంలో కాలేజీ విద్యావిధానం విశ్వవిద్యాలయ స్థాయిల్లో గరిపే విద్యా విధానం ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా కొనసాగుతోంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంతో అవసరం. అందుకు ఆంగ్ల వ్యాకరణంపై పట్టు తప్పనిసరి. అందుకు ఈ పుస్తకం సహకరిస్తుంది.

Preview download free pdf of this Telugu, English book is available at Swastik English Grammar