• Swarna Khadgam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వర్ణఖడ్గం

    Swarna Khadgam

    Author:

    Pages: 554
    Language: Telugu
    Rating
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    '4.25/5' From 8 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 5 premium votes.
Description

"ఏమయింది స్వామీ? మా చిరంజీవి జన్మించిన వేళ సరయినది కాదా?” ఆశ్చర్యం, ఆందోళన కలగలిసిన కంఠంతో వెంటనే అడిగాడు చక్రవర్తి.

"నీ చిరంజీవి జన్మించిన వేళ సరయినదే.... అతులిత శక్తి సంపన్నుడై. సర్వంసహా చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటాడు. నిండు నూరేళ్లు నిరభ్యంతరంగా జీవిస్తాడు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాని, పదిరెండు సంవత్సరాల ప్రాయం వచ్చేవరకూ దారుణమైన కష్టనష్టాలను అనుభవిస్తాడు.... జన్మకాలంలోని కొన్ని గ్రహాల కలయిక, ఇతని తల్లిదండ్రులకు చెప్పరాని కీడును కలిగించబోతోంది. చిరంజీవి స్థానభ్రష్టుడై పరాయివారి పెంపకంలో అవమానాలను, అపనిందలను అనుభవిస్తాడు..... ఈ కష్టదశ పదిరెండు సంవత్సరాలు మాత్రమే. తర్వాత అన్నీ శుభాలే....” అరమూసిన కనులతో చెప్పాడు ముచికుందుడు.

చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. తమ తలల మీద పిడుగులు పడినట్టు అదిరిపడ్డారు అక్కడివారు.

ముంచుకువస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నంమీద అదుముకుంటూ, “స్వామీ! మంత్ర తంత్ర శాస్త్రాల్లో తమరిని మించినవారు ఎవరూ లేరు.... తమరు మా చిరంజీవికి రానున్న కష్టనష్టాలను సరిచేయలేరా?” గద్గద కంఠంతో అర్థించింది మహారాణి వాసంతికాదేవి.

"మంత్రాలు, తంత్రాలు మన నుదుటిరాతను మార్చలేవు తల్లీ.... అయినాసరే ప్రయత్నం చేస్తాను....” అంటూ ధ్యానంలో నిమగ్నమైనాడు ముచికుందుడు.... ఉన్నట్టుండి కనులు తెరిచి, చేతుల్ని ముందుకు జాచాడు.

* * *

ఇది స్వర్ణఖడ్గం నవల రెండు భాగాలు కలిపిన సంపుటం.

Preview download free pdf of this Telugu book is available at Swarna Khadgam
Comment(s) ...

Is this ebook just like the print version or like the previous kingie self published one with a new cover. In free pdf preview it's the self published one. Pl. clarify.

మధుబాబు.. గారు రాసిన మరొక అద్భుతమైన జానపదం.. నేను చదివాను జానపద పుస్తకాలలో.. మధుబాబు గారి బుక్స్ ల ఏవీ అనిపించటం లేదు...

Do you like Madhubabu's Shadow novels? Do you enjoy those novels depicting Shadow's adventures in those days before he becomes a spy? Then you will like this novel. This is practically a Shadow adventure set in a folklore backdrop. All the ingredients of Madhubabu novels (action, humor, twists etc.) can be found in abundance here too. Only thing bad about this novel is that it has a tragic ending - the hero ends up marrying 3 girls :)

This novel is now available in Tenglish script with Kinige. For details, click the link.