-
-
స్వర్ణ కమలాలు 1
Swarna Kamalalu 1
Author: Illindala Saraswati Devi
Pages: 162Language: Telugu
శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి రచించిన స్వర్ణ కమలాలు 100 కథల సంకలనంగా 1981లో ప్రచురింపబడ్డది. ఈ కధా సంకలనానికి 1982లో కేంద్ర సాహిత్య అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలు ఉత్తమ తెలుగు గ్రంథముగా గుర్తింపు బహుమతి ప్రకటించాయి. ఈ గ్రంథములోని అనేక కథలు హిందీ, కన్నడ మరియు ఇతర భాషలలోకి తర్జుమా చేయబడ్డయి. ఈ 100 కథా సంకలనము పునర్ముద్రణ చేయాలన్న సంకల్పంలో మొదటి భాగంగా 25 కథల సంకలనము ఇ-పుస్తకంగా మీకు అందజేస్తున్నాము.
* * *
సరస్వతీదేవి గారి కథలు ఉన్నతాదర్శలనూ ఉత్తమాభిరుచులనూ పెంపొందించే ఉదాత్తదృష్టితో తీర్చిదిద్దిన రచనలు. ఈ కథల్లో ప్రధానంగా ఆకర్షించే విశేషం ఆపారమైనవస్తు వైవిధ్యం, ఎన్నో తరాల వాళ్లు ఎన్నో తరహాల వాళ్లు కళ్ల ముందు మెదులుతారు. మూసలో పోసిన అచ్చులుకాక రక్తమాంసాలతో జీవించే నరనారీ జనాన్ని పాత్రలుగా మలచటంలో నైపుణ్యం కనబరిచారు. చాలా కథల్లో సామాన్య మానవుల సుఖదుఃఖాలూ, ఆశా నిరాశలూ, విజయ పరాజయాలూ, విలాస విలాపాలూ సహజ సుందరంగా ప్రతిబింబించారు.
* * *
మళ్లీ మళ్లీ చదవాలనిపించేది గొప్ప కావ్యం అన్నాడు కోల్రిజ్. ఒకసారి చదివితే మనస్సులో చెరిగిపోకుండ నిలిచేవి గొప్ప కథలు. అవి ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తాయి, నిత్యనూతనంగా అలరించే అనాది సూర్యోదయంలాగా. అటువంటి లక్షణాలున్న కథలు ఈ సంపుటంలో వున్నాయి.

- ₹162
- ₹108
- ₹96
- ₹96
- ₹72
- ₹162