• Swapnika Silpalu Kavitanuseelana
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వాప్నిక శిల్పాలు - కవితానుశీలన

    Swapnika Silpalu Kavitanuseelana

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. కొండూరి శ్రీదేవి గారి సాహితీ కృషిని రవికుమార్ సవిస్తారంగా చర్చించి పొందు పరిచిన జీవన మరియు సాహితీ సమాహార స్రవంతి “స్వాప్నిక శిల్పాలు - కవితానుశీలన", ఇది ఎం.ఫిల్ పట్టాకోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం. ఇది ఐదు అధ్యాయాల మేలు కొలుపు. డా. కొండూరి శ్రీదేవి గారి జీవితాంశాలు, సాహితీ కృషి ఆమెపట్ల ప్రముఖుల అభిప్రాయాలు మొదటి అధ్యాయంలో పరిచితమౌతాయి. “స్వాప్నిక శిల్పాలు" సంపుటంలోని వస్తు వైవిధ్యం రెండవ అధ్యాయంలో ఎదురు పడుతుంది. ఆ దశలో ఒక్కొక్క కవితకి విశ్లేషణా దీపం పెట్టాడు. అందినంత మేరా ఆ సంపుటంలోని వెలుగు రేఖల్లో దోగాడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత, కుల తత్త్వాలతో సతమతమౌతున్న సమాజాన్ని వొడిసి పట్టుకుని -

నిద్రిస్తే లేవలేని కుంభ కర్ణులు

జాతినేం మేల్కొల్పుతారు అల్పజీవులు

.... ఈ నేతలు... మన నేతలు

అనే లోకరీతిని ప్రతిబింబింప చేశాడు.
స్త్రీ దృక్పథాన్ని, స్త్రీ చైతన్యాన్ని దృష్టిలో వుంచుకొని స్వాప్నిక శిల్పాల్ని విశ్లేషించడం, పురాణేతిహాసాలలో ప్రబంధ యుగం నాటి స్త్రీతో పోల్చి ప్రాధాన్యాన్ని చర్చించడం మూడవ అధ్యాయంలోని ప్రధానాంశం. రచయిత్రి అందించిన సందేశాన్ని - అందులోనూ “కునుకు లేనిరాత్రి, ఉగాది, సామాజికత, మేధ సందేశం, స్వాప్నికుడి జీవితం .... వంటి కవితల ద్వారా సుతిమెత్తగా సందేశాల్ని వెలికితీసేందుకు ప్రయత్నించిన అధ్యాయం - నాల్గవ అధ్యాయం. చలన శీలమైన సమాజంలోని సామూహిక స్థితులకు అనుగుణంగా “స్వాప్నిక శిల్పాల”లోని “వైశిష్ట్యం" - అందులో వ్యక్తమైన భావ పరంపరల్ని అనేక కోణాలలో దర్శించిన తీరు ఐదవ అధ్యాయంలో చూడగలం. పరిశీలనకు పరిశోధకుడు ఎంచుకున్న తీరు యిది. ఇది విమర్శలో ఒక భాగం. మనల్ని ముగ్గుల్ని చెయ్యకమానదు.

- డా. ఎస్. షమీఉల్లా

Preview download free pdf of this Telugu book is available at Swapnika Silpalu Kavitanuseelana