-
-
స్వీయచరిత్రము
Sveeyacharitramu
Author: Chilakamarthi Lakshminarasimhamu
Publisher: Prachee Publications
Language: Telugu
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
భారత స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలంలో తెలుగువారిని ఉత్తేజపరిచిన అద్భుతమైన పద్యం ఇదంటే అతిశయోక్తి కాదు. ఈ పద్యం చెప్పిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ఆత్మకథ ఇది.
పండిత కుటుంబంలో పుట్టిన చిలకమర్తి సంస్కృతాంధ్రాల్లో ప్రావీణ్యం సంపాదించి, రాజమండ్రి కళాశాలలో ఆంగ్లాన్నీ అభ్యసించాడు. రాజమండ్రిలో చదువుకొంటున్నప్పుడే, వీరేశలింగం భావాలవైపు ఆకర్షింపబడి, ఆయన అనునూయులలో అగ్రగణ్యుడైనాడు. అప్పటికే, రాజమండ్రిలో నెలకొనివున్న సంస్కరణ వాతావరణం, కళాశాల చదువు, అప్పుడప్పుడే రాజుకొంటున్న జాతీయభావజాలం చిలకమర్తిపై తీవ్రప్రభావాన్ని కల్గించాయి. 21 అధ్యాయాల్లో రాసిన 'స్వీయ చరిత్రము'లో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం, గ్రంథరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ - యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంథాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్దృష్టితో పరికించాడు.
- - వకుళాభరణం రామకృష్ణ

- ₹60
- ₹60
- ₹135
- ₹243
- ₹675.6
- ₹64.8