• Sundari Subrahmanyam Navvula Kathalu Rendava Bhagamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుందరి సుబ్రహ్మణ్యం నవ్వుల కథలు - రెండవ భాగము

    Sundari Subrahmanyam Navvula Kathalu Rendava Bhagamu

    Publisher: Chadaram Book House

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాస్య భరితమైన సన్నివేశం చూసినప్పుడు గాని, దాని గురించి విన్నప్పుడు గాని సంతోషంగా నవ్వుకోవటం సర్వ సాధారణం, మానవ సహజం. నవ్వు వచ్చే అంశం వుండాలేగాని, ఆనందిస్తూ నవ్వకుండా ఎవరూ వుండలేరు. నవ్వుకొనే అవకాశం ఎప్పుడు వస్తుందా అని అర్రులు చాస్తూ, అలాంటిది, ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా, పట్టపగ్గాలు లేకుండా పడి పడి నవ్వుతారు కొందరు. మరి కొందరు, హాస్యం ఎక్కడ దొరుకుతుందో, పనికట్టుకొని వెతికి మరీ పట్టుకొని, హాస్యరసాస్వాదన చేస్తూవుంటారు. నవ్వు వచ్చినప్పుడు, మహదానందంగా, మనసారా, నవ్వగలగటం భగవంతుడు మానవాళికి ప్రసాదించిన ఒక గొప్ప వరం.

సున్నితమైన హాస్యం గొప్ప వినోదాన్ని యిస్తుంది. జిహ్వకు షడ్రసోపేతమైన భోజనంలాగా, మంచి హాస్యం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. అనేకానేక శారీరక రుగ్మతలకు, మానసిక ఒత్తిళ్లకు విరుగుడుగా పనిచేస్తూ, మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం లాగా పనిచేస్తుంది. అది తేనెపట్టులోని తియ్యటి తేనె, జీవిత మకరందం. దానిని ఎంత జుర్రినా ఇంకా జుర్రాలనేవుంటుంది. అది కలియుగామృతం. నిత్యం సంతోషాన్ని చిమ్మే మధుర మంజుల సంజీవిని.

ఒకరి మనసు నొప్పించకుండా వుండి, నవ్వు రప్పించేది మంచి హాస్యం. ఆ హాస్యం పండించటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక హాస్య సన్నివేశాన్ని సృష్టించటం ఏదో యాదృచ్ఛికంగా తళుక్కున మెరుపు మెరిసినట్టు జరగాలేగాని, పట్టి పట్టి ప్రయత్నించినా ఒక్కొక్కమారు కుదురదు. సినిమాల్లో కాని, కావ్యాల్లో కాని, నిజ జీవితంలో కాని అలాంటి గొప్ప హాస్యాన్ని అందించేవారు నిజంగా అభినందనీయులు.

ఏదో కాల్పనిక జగత్తునుండో, ఆకాశం నుండో ఊడిపడి వచ్చేది కాదు హాస్యం. అది ప్రతివారి జీవితంలోనూ నిత్యం పండే పంట. హాస్యాభిరుచి వున్నవారు, అలా అప్పుడప్పుడు మదిలో మెదిలే మెరుపుతీగెలను, అక్షరస్థం చేసి, లోకానికి అందిస్తూ వుంటారు. వారు మహనీయులు, మహానుభావులు.

నవ్వు వచ్చినప్పుడు నిండుగా నవ్వితే మనసు తేలికపడుతుంది. మనసులో పేరుకుపోయిన మలినం అంతా కడిగివేసినట్లౌతుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. నవ్వటం, నవ్వించటం ఒక సజీవ కళ. ఆ కళను అర్థం చేసుకుని, అభ్యసించి, ఆచరించి, ఆనందించటం మన అందరి విధి.

మాకు తోచిన శైలిలో, మాకు కలిగిన అనుభవాల ఆధారంగా, యీ పుస్తక రచనకు పూనుకున్నాము. ఇందులోని హాస్యం సర్వజనాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

- సి.ఎన్. నాగేశ్వర రావు
సి.ఎల్. రాజకుమారి

Preview download free pdf of this Telugu book is available at Sundari Subrahmanyam Navvula Kathalu Rendava Bhagamu