• Sufi Kavitvam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సూఫీ కవిత్వం

    Sufi Kavitvam

    Author:

    Pages: 233
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అరబీ భాషలో సుఫ్‌ అంటే ముతకవున్ని అని అర్థంట. సూఫీ అంటే దానితో నేసిన బట్ట కట్టుకునేవాడు. ఆడంబరాలకు దూరంగా పవిత్రంగా జీవితాన్ని గడిపేవాడు సూఫీ అని రూఢర్థం. అరబీలో సూఫీతత్వాన్ని తసవ్వుఫ్‌ అంటారు. సూఫీ కవిత్వాన్ని చదివితే, సూఫీతత్వమూ తెలుస్తుంది.

మౌలానా జలాలుద్దీన్‌ రూమీ, ఫరీవుద్దీన్‌ అత్తార్‌, రబియా, హాఫిజ్‌ గొప్ప సూఫీ కవులు.

రూమీ ఆఫ్ఘనిస్తాన్‌లో క్రీస్తుశకం 1207లో జన్మించారు. 1273లో కాలం చేశారు. ఫారసీ భాషలో కవిత్వం చెప్పారు. సూఫీ కవుల్లో అగ్రగణ్యులుగా కీర్తింపబడ్డారు. వీరి 'మస్నవీ' కావ్యం గొప్ప పేరుప్రఖ్యాతులు పొందింది. ఫరీవుద్దీన్‌ అత్తార్‌ మొదట్లో వ్యాపారి. తరువాత ఫకీరు. కాలం 1136-1230. రూమీ పన్నెండేళ్ళవాడుగా వున్నప్పుడే చూసి అతడి సౌభాగ్యాన్ని గుర్తించినవాడు.

రబియా పైఇద్దరికంటే ముందు ఆమె. కాలం 710-780. ఈమెది ఇరాక్‌లోని బస్రా నగరం. అరబీ భాషలో ఈ అమ్మ చెప్పిన కవితలు ఎక్కువ లేవుగాని, చెప్పినంతవరకు అవి గొప్పగా కీర్తింపబడుతున్నవి.

హాఫిజ్‌ 14వ శతాబ్దం మొదట్లో ఇరాన్‌ దేశంలో పుట్టి అదే శతాబ్దం చివర్లో దేహం చాలించారు. ఫారసీ భాషలో రచనలు చేశారు. రూమీ అంతటివాడుగా ప్రసిద్ధి పొందారు. భగవంతుడి కోసం పడే తపనే, ఆరటమే ఆయన కవిత్వం. దాన్నే ప్రతీ కలలో చెబుతాడు. ప్రేయసి భగవంతుడు. మధువు భగవంతుడి మీద వుండే ప్రేమ. మధువు సేవించి మత్తిల్లటం అంటే భగవత్‌ భక్తిపారవశ్యంలో మైమరచి వుండటం. మధుపాత్ర హృదయానికి గుర్తు. మధువు అందించేవాడు భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు. హాఫిజ్‌ కవిత్వాన్ని ఇట్లా అన్వయించుకుంటూ అర్థం చేసుకోవాలి. మిగతా సూఫీ కవులకూ ఇది వర్తిస్తుంది.

- దీవి సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Sufi Kavitvam