• Subbalakshmi Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుబ్బలక్ష్మి కథలు

    Subbalakshmi Kathalu

    Publisher: Srujana

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాలపర్తి జ్యోతిష్మతిగారి కథలు చిరుహాస్యపు చినుకులు జల్లుతూ పాఠకుల మనసులకు ఉల్లాసం కలిగించడమే కాకుండా, సంసార సంబంధాల్లో దరహాసాలు వికసించాలంటే, కుటుంబ సంబంధాలూ, ఆలోచనలూ ఎలా ఉండాలో తెలుసుకునేలా చేస్తాయి. ఇవి ‘సుబ్బలక్ష్మి కథలు’ పేరుతో ‘చినుకు’ మాసపత్రికలో ఫిబ్రవరి 2010 నుంచి మార్చి 2012 వరకూ రెండేళ్ళ కాలంలో ధారావాహికంగా వచ్చిన కథలు. ఇవి చదువుతూంటే, కాంతం గురించి రాసిన మునిమాణిక్యంగారి కథలూ, భానుమతిగారి అత్తగారి కథలూ, పురాణంవారి ఇల్లాలి ముచ్చట్లూ గుర్తుకొస్తాయి - సంసారంలో హాస్యం చూపించడంలో. ఈ రచయిత్రి వారి కోవకి చెందినట్లు అనిపిస్తారు.

మన ఆధునిక జీవనంలో ఉండే అవకతవకల్ని ఎత్తి చూపించడంలోనే చిరునవ్వులు తెప్పించగలదు సుబ్బలక్ష్మి. అటువంటి సుబ్బలక్ష్మికి కాస్త పట్టూ విడుపూ ఉన్న సుబ్బారావు భర్తగా లభించినట్లు రాయడంలో రచయిత్రి విజ్ఞత కనిపిస్తుంది. అటువంటివారి సంతానం కూడా మంచి వాతావరణంలో పెరుగుతుంది అని చూపించారు.

పాలపర్తి జ్యోతిష్మతిగారు తెలుగు సంసారాల్లో మరిన్ని దరహాసాలు పండిచే కథలు ఇంకా రాయాలని కోరుతూ, ఆమెకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

- అబ్బూరి ఛాయాదేవి

Preview download free pdf of this Telugu book is available at Subbalakshmi Kathalu