• Streelu Vardhillali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్త్రీలు వర్ధిల్లాలి

    Streelu Vardhillali

    Pages: 63
    Language: Telugu
    Rating
    4.90 Star Rating: Recommended
    4.90 Star Rating: Recommended
    4.90 Star Rating: Recommended
    4.90 Star Rating: Recommended
    4.90 Star Rating: Recommended
    '4.90/5' From 42 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014"కి "ఓదెల వెంకటేశ్వర్లు" పంపిన నవల "స్త్రీలు వర్ధిల్లాలి".

* * *

KinigeNovelCompetitionLogo
''ఏమన్నావ్‌... మళ్ళీ అను చూద్దాం.. నీ అంతు చూస్తా'' అన్నాడు కళ్లలో చింతనిప్పులు కురిపిస్తూ.

''సరే లే చూద్దాం. మాకు రాదు మరి'' అంది నీరజ.

''ఇప్పుడు కాదు. ఇంటర్వెల్‌ కాని అప్పుడు చెబుతాను'' అంటూ వెళ్ళిపోయాడు.

''పోరా..పో..'' చెయ్యి ముందుకి చూపుతు అంది. చందూ ముందుకు వెళ్ళిపోయాడు. నీరజని ఏదో ఒకటి చేయ్యాలి అనుకుంటూ.

''ఏంటే నీరజ. నీ మొండి ధైర్యం. వాడు ఈ మధ్యనే కాలేజిలో చేరాడు కదూ'' అడిగింది దుర్గనేత్ర.

''అవును దుర్గా. చేరినప్పటి నుండి నన్ను తినేటట్టు చూస్తున్నాడు. సందు దొరికితే చాలు మీద పడిపోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు సమయం దొరికింది కదాని వార్నింగ్‌ యిచ్చినట్టుగా వుంటుందని అలా చెడామడా తిట్టేశాను.''

''నాకైతే రెచ్చ గొట్టినట్టుగా అనిపిస్తోంది. జాగ్రత్తగా వుండు.''

''మరేం పర్లేదు దుర్గ. ఇలాంటి వాళ్ళ ఆడకట్టించడానికి 'కోతల బృందం' తిరుగుతోంది. వాళ్ళకు గాని సమాచారం వెళ్ళిందంటే వీడి జీవితంలో సంసారానికి పనికిరాడు. అలాచేసి పారేస్తారు.''

''నీకు వాళ్ళు తెలుసా'' ఆశ్చర్యంగా అడిగింది దుర్గనేత్ర.

''వాళ్ళు మనకు తెలియనక్కర్లేదు. వాళ్ళకు మనం అందరం తెలుసు''

''అదే ఎలా తెలుసని''

'' ఏదైనా రేప్‌, ఈవ్‌ టీజింగ్‌ జరిగితే ఎంత మందిని వాళ్ళు శిక్షించలేదు. అందుకే అలా చెప్పాను''

''అంటే వాళ్ళు మన కాలేజివాళ్ళనా''

''అయితే అయివుండొచ్చు, కాకపోయివుండవచ్చు. కాని మొత్తానికి వాళ్ళ మనుషులు మాత్రం ఇక్కడున్నారని ఖచ్చితంగా చెప్పలగలను. లేక పోతే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లు వాళ్ళకు ఎలా చేరుతున్నాయి. వాళ్ళను టార్గెట్‌ చేసి ఎందుకు శిక్షస్తున్నారు.'' అంది నీరజ.

Preview download free pdf of this Telugu book is available at Streelu Vardhillali