• Srushti Ketanam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సృష్టికేతనం

    Srushti Ketanam

    Author:

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'సృష్టికేతనం' దీర్ఘకవితలో స్త్రీ, పురుష బాంధవ్యం కారణంగా సంభవించే పుట్టుకకు రచయిత్రి ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీని స్త్రీగా గౌరవించలేదంటే పురుషునికి పుట్టుకే లేదు అంటూ బెదిరించారు. స్త్రీ జాతి క్షమ మీకు బిక్ష అంటూ హెచ్చరించారు. ఆడపిల్ల లేకుంటే ఎలా పుడతారంటూ మగ మృగాలను ప్రశ్నించారు. ప్రేమించటం అంటే శారీరకంగా ఆశించటం కాదన్నారు. స్త్రీ భూమికి ప్రతి రూపం అన్నారు. ఆడది + ఆకలి వెరసి కనిపించే అమ్మతనం, అపరకాళిగా మారితే పురుష సమస్తానికి స్వరూపం ఉండదన్నారు. తరతరాలుగా భారతీయ సంస్కృతిని అమ్మ, నాన్న, గురువు, సోదరీ సోదరులు, సమాజం, స్నేహితులు, ప్రేమికులు కలిసి జీవించే భార్యాభర్తల ప్రేమే పాలిస్తోందన్నారు.

ప్రస్తుత సమాజ నడవడికలో స్త్రీ పురుష లైంగికత ఎంత వికృతమవుతున్నా ఆకర్షణ, సృష్టి ధర్మంగా మనుగడను నడిపిస్తుంది. స్త్రీ ఆకర్షణ, సాన్నిహిత్యం అనుభవైక నైవేద్యంగా పీడించే లైంగిక ఉన్మాదం రాక్షస నేర హింసా ప్రవృత్తిగా ఎంత వికృతమవుతున్నదీ కవయిత్రి స్పష్టం చేయడంలో కృతకృత్యులయ్యారు. ఇంత సుదీర్ఘ కవితను రచించిన శైలజామిత్ర ధన్యులు.

- జయసూర్య

Preview download free pdf of this Telugu book is available at Srushti Ketanam