• Srungarapuram Oka Kilomeetaru
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శృంగారపురం ఒక కిలోమీటరు

    Srungarapuram Oka Kilomeetaru

    Pages: 353
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇద్దరూ ఇంటిబయటికి వచ్చి కొండమీద కూర్చున్నారు. ఊరు వెన్నెల్లో గ్లాసు బిగించిన చిత్రపటంలా వుంది. పక్కనున్న దేవాలయం ఇసుకలో పెట్టిన గూడులా వుంది.

"ఏం దేవాలయం అది?"

"మన్మథ దేవాలయం"

"మన్మథ దేవాలయమా?" బిగుసుకుపోయాడు నరుడు.

కాసేపటికి తేరుకున్నాక అన్నాడు "అదేమిటి గురుడా! ఎక్కడయినా రామాలయం, కృష్ణాలయం వుంటాయిగానీ, ఇదెక్కడి చోద్యం? శృంగార దేవుడికి దేవాలయం వుండడం నేను ఇంతవరకు వినలేదు."

"అదే మరి మా ఊరి స్పెషాలిటీ. ముక్తికి మార్గం భక్తీ, రక్తీ అన్నారు పెద్దలు. మేం రెండవది ఎంచుకున్నాం. అంతే తేడా. ఇంకో విచిత్రం చెప్పనా? ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవుడ్ని దర్శించుకోవాలంటే స్త్రీలు పైట తీసి బొడ్లో దోపుకుని వెళ్ళాలి. పురుషులు తమ కండువాలనూ, తువ్వాళ్ళనూ మొలలకు చుట్టుకోవాలి. అంటే టాప్‌లెస్ అన్నమాట. ఇది దేవాలయంలో ఆచరణలో వున్న పద్ధతి."

నరుడు అలా నోరు తెరిచి వింటూ వుండిపోయాడు.

"ఎందుకంత ఆశ్చర్యపోతావ్? ఆ వెంకటేశ్వరస్వామి దగ్గిరికి వెళ్ళినవాళ్ళు గుండు గీయించుకుంటున్నారు గదా. ఎందుకనుకుంటున్నావ్? తన అహం తగ్గాలని. అలానే, ఇక్కడ పైన ఏ అచ్ఛాదనా లేకుండా వెళ్ళి దేవుడ్ని దర్శించుకుంటారు మోహం తగ్గాలని, అఫ్‌కోర్స్ స్త్రీలు రవికెలు వుంచుకోవచ్చు. కేవలం పైట తీసెయ్యాలి."