• Sripati Satakamu T Sudhakar Babu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీపతి శతకము - టి. సుధాకర్ బాబు (free)

    Sripati Satakamu T Sudhakar Babu - free

    Pages: 25
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిరుమలశెట్టి సుధాకర్ బాబు వ్రాసిన శ్రీపతి శతకము ఆపాత మధురము. గంగా ప్రవాహము వలె జాలు వారిన శతకామృతము ప్రశంసనీయము. పొంగి పొరలిన భక్తుని కవితావేశము అడుగడుగునా ద్యోతకమగుచున్నది.

ఇందు దశావతార వర్ణన, బ్రహ్మోత్సవ సందర్భములో వాహనముల వర్ణన, ఏడుకొండల వర్ణన విశిదముగా నున్నది. అడుగడుగునా అచ్చతెనుగు పదముల వాడుక ఆహ్లాదభరితముగా నున్నది. "అగ్గిచూలి", నీటిపుట్టుగుపట్టి" వంటి పదములు సందర్భోచితముగా నున్నది.

"జీవతత్వ మేది జీవి ఉనికిఏది, జీవి కేది వలయు జీవితమున" అనిన సందర్భమున కవి అన్వేషణ, “ఎన్ని జన్మ లెత్త నేమి ఫలము" అనుటలో వైరాగ్యం బోధపడుచున్నది. "దిక్కు లన్నియు నీవే" అను పద్యములో భగవంతుడు సర్వవ్యాపి అను సత్యము తెలియుచున్నది.

"డబ్బు శాశ్వతమని డాబుతో కనుగప్ప డబ్బు తోడ వచ్చె డబ్బు జబ్బు": మనం సృష్టించిన డబ్బు మనలనే శాసించుచున్నది. 'డబ్బు జబ్బు' అను పదము మనసున ముద్ర వేయుచున్నది.


మట్టి లోన పుట్టి మట్టి లోనే కలిసి
మళ్ళి మళ్ళి పుట్టి మంట గలిసి
మనుజ జన్మ ఎత్తి మరలరాకుండగ,
మొఱను ఆలకింప మ్రొక్కె దెపుడు. ఈ పద్యంలో మోక్ష కాంక్ష తెలియుచున్నది.

ప్రతి పద్యములోనూ పదములు ఆణిముత్యములు. తడబాటు లేక భక్తి తత్పరతతో ఎగసిపడిన భావరత్నములీ పద్యములు.

- టి. పద్మలోచనా దేవి