• Srimadbhagawadgita Shankara Bhashyam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్భగవద్గీత శంకరభాష్యము

    Srimadbhagawadgita Shankara Bhashyam

    Pages: 588
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశ్వవాఙ్మయంలో భగవద్గీతకున్న విశిష్టత మరేదేనికి లేదు. సమస్త వేదవేదాంతాల యొక్క సారం దీనిలో నిక్షిప్తమై ఉంది. దీనిపై ఎంతో మంది ఆచార్యులు భాష్యాలను, వ్యాఖ్యానాలనూ వ్రాసారు. శ్రీ శంకరాచార్యులు రాసిన భాష్యం అత్యంత ప్రాచీనతమమైనది. శ్రీ శంకరుల మృదుమధురమైన సంస్కృత భాష, ఉపనిషదాదుల వ్యాఖ్యలను ఉదహరిస్తూ సాగిన సరళ వ్యాఖ్యాన రీతి, సులభంగా అవగతం అయ్యేటట్లు అవలంబించిన పద్ధతి సహృదయ హృదయరంజకమైనది. ఆధ్యాత్మిక సాహిత్యంలో దేనికీ లేనంతగా దీనికి అనువాదాలు వెలువడ్డాయి. సాధకుడికి సాధనా పథంలో తన అభిరుచికి తగ్గట్టు కర్మ, భక్తి, జ్ఞాన, రాజ యోగ మార్గాలను విపులంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గ్రంథరాజం 'శ్రీమద్భవద్గీత'.

అనువాదకులు బ్రహ్మశ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు నిరంతరాధ్యయన తత్పరులు, తత్త్వజ్ఞులు. ప్రస్తుత గ్రంథం శ్రీమద్భగవద్గీతకు రాసిన శ్రీ శంకరాచార్యుల సంస్కృతభాష్యానికి తెలుగు అనువాదం భాషాపరంగానూ, భావపరంగానూ కూడ అతి దగ్గరగా ఉండి ప్రతీ ఒక్కరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో సాగింది. శ్రీ శంకరుల సంస్కృత భాష్యం చదవలేనివారికి ఆ లోటును ఈ అనువాదం తీర్చగలదనడం అతిశయోక్తి కాబోదు.

భగవద్గీత భాష్యాన్ని పవిత్ర గ్రంథమని మాత్రమే తలచక, ఇది అనుష్టించదగ్గది అని తెలియజేయడం కోసం సులభమైన, సరళశైలిలో సాగిన ఈ భగవద్గీతా శంకరభాష్య తెలుగు అనువాదాన్ని పాఠకుల ముందుంచుతున్నాం. తెలుగు పాఠకుల ఆత్మవికాసానికి ఈ గ్రంథం తోడ్పడుతుందని ఆశిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Srimadbhagawadgita Shankara Bhashyam