• Srimadbhagavadgita Tatvavivechana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్భగవద్గీత తత్త్వవివేచన

    Srimadbhagavadgita Tatvavivechana

    Publisher: Mallina Venkata Rao

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భక్తి, జ్ఞానము, కర్మ, యోగము (ధ్యానము) అను వివిధ మార్గములను అనుసరించు వారు ఆధ్యాత్మ్య క్షేత్రమున కలరు. వీరిలో కొందరు తమ మార్గమే శ్రేయస్కరమని భావించుచు అన్య మార్గములు సరియైనవి కావని వాదింతురు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాదవివాదములను తొలగించుటకై గీతోపదేశమున సర్వమార్గముల సమన్వయము చేసెను. మోక్షము పొందుటకు భక్తి, జ్ఞానము, కర్మ, యోగము (ధ్యానము) అను నాలుగు మార్గములు కలవనియు, ఏ మార్గమున ప్రయాణము చేసినను మోక్షము పొందవచ్చుననియు తెలిపెను. తమ తమ సంస్కారములు, యోగ్యతలు మరియు పరిస్థితులను అనుసరించి తగు మార్గమున ప్రయత్నించ వచ్చునని తెలిపెను.

కొందరు కర్మాచరణయందు ఆసక్తి, యోగ్యత కలిగి యుందురు. అట్టివారు కర్మతత్త్వమును, నిష్కామకర్మ మహాత్మ్యమును అవగతము చేసుకొని భగవదర్పితముగా కర్మలను ఆచరించి మోక్షమును పొందవచ్చును. వారి నిమిత్తమై ‘‘కర్మయోగము’’ అను అధ్యాయము గీతయందు ప్రత్యేకముగా కలదు. మరికొందరు భక్తిమార్గమును అనుసరించెదరు. వారి నిమిత్తమై ‘‘భక్తియోగము’’ అను ఒక అధ్యాయము గీత యందు కలదు. మరికొందరు ఆత్మానాత్మ వివేచన యందు శ్రద్ధ కలిగి యుందురు. వీరి నిమిత్తమై ‘‘జ్ఞానయోగము’’ ‘‘జ్ఞానవిజ్ఞాన యోగము’’ ‘‘ క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగము’’ అను అధ్యాయములు కలవు. మరికొందరు ధ్యానము నందు మక్కువ కలిగియుందురు. వీరికి బాహ్య వ్యవహారములయందు ఆసక్తి యుండదు. సదా అంతర్ముఖులుగా ఉండగోరెదరు. వీరి కొరకు ‘‘ధ్యానయోగము’’ (ఆత్మ సంయమ యోగము) అను అధ్యాయము కలదు. ఈ విధముగా భిన్న భిన్న మనస్తత్వములు కలవారి నందరిని గీత సంతృప్తి పరచి, అన్ని మార్గములు సరియైనవే అని నిరూపించుచున్నది. సర్వయోగ సమన్వయము, భక్తి, జ్ఞాన, వైరాగ్య మిశ్రిత నిష్కామకర్మ- గీత యొక్క ప్రముఖ లక్షణములు.

పై విధముగా భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యానముల నిమిత్తమై వేర్వేరు అధ్యాయములు ఉన్నప్పటికీ ఆయా విషయములు ఆయా అధ్యాయముల యందు మాత్రమే వివరింపబడలేదు. పై విషయములు కొద్దిగానో, ఎక్కువగానో అన్ని అధ్యాయముల యందు కలవు. వివిధ అధ్యాయములయందు, వివిధ శ్లోకములయందు గోచరించు భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గముల వివేచన ఒకచోట చేర్చి గీతాతత్త్వమును అవగతము చేసుకొనుటకు ప్రయత్నము జరిగింది. ఈ ప్రయత్నము సమగ్రము కాదు. స్వీయ జిజ్ఞాస కారణముగా నా బుద్ధికి తగినట్లుగా ప్రయత్నించితిని. జనన మరణములు, జీవాత్మనిత్యత్వము, జీవాత్మ పరలోకగమనము, జీవాత్మ మరల శరీరమున ప్రవేశించుట- ఈ విషయముల వివేచనకు ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రముల అధ్యయనము సహకరించినది. నా యొక్క ఈ సాధన సఫలీకృతము అగుట భగవత్‌ సంకల్పము పై ఆధారపడియున్నది.

- మల్లిన వెంకట్రావు

Preview download free pdf of this Telugu book is available at Srimadbhagavadgita Tatvavivechana