• Srimadbhagavadgita S R Book Links
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్భగవద్గీత - ఎస్.ఆర్. బుక్ లింక్స్

    Srimadbhagavadgita S R Book Links

    Publisher: S.R. Book Links

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రామాయణ, భారత, భాగవతాల విశిష్టత ఏమిటంటే, ఈనాడు ఎంతమంది, ఎన్ని రకాల రాజకీయవేత్తలు వచ్చినా, ఎంతమంది పారిశ్రామిక వేత్తలు వచ్చినా, ఈ మూడు గ్రంథాలలోని ఏదో ఒక వ్యక్తితోనో, సంఘటనతోనో సరిపోలుతుంది. వ్యాసమహర్షి అన్నాడు, "ఈ భారతంలోని వ్యక్తులు ఎల్ల కాలాలలోను ఉంటారు. ఇందులో లేని వ్యక్తులు సంఘటనలూ భూత, భవిష్యద్వర్తమానాలలో ఎక్కడా ఉండరు" అని. నిజమే, రామాయణ, మహాభారతాలు సార్వజనీనకమైనవి, సర్వకాల సర్వావస్థలయందూ దర్శింపదగినవి.
రామాయణంలోని వశిష్ఠగీత, మహాభారతం లోని భగవద్గీతలలో లేని జీవన ప్రమాణాలు ఇంకెక్కడా లేవు. ఆ పుస్తకాలు చదివితే మనిషన్నవాడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది తెలుస్తుంది. ప్రపంచంలో ఏ భాషలోని మానసిక శాస్త్రాలు, నీతి, రాజనీతి శాస్త్రాలు, నిర్వహణ శాస్త్రాల ముఖ్యాంశాలన్నీ ఈ ఉద్గ్రంథాలలో ఉన్నాయి. మానవ వికాసానికి పనికివచ్చే విషయాలు, సూత్రాలు వీటిలో ఉన్నాయి.
ఈనాడు విదేశీ ప్రముఖులు సైతం రామాయణ, భారత, భాగవతాల్లోని ముఖ్యమైన విషయాల గురించి విశ్లేషణ చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
భగవద్గీత మన వెంట ఉంటే, విజయానికి ఎదురులేదు. సంక్షిప్తంగా 'భగవద్గీతలో వ్యక్తిత్వ వికాసము" వ్రాశాను. చదవమనీ, విషయాలను ఆకళింపు చేసుకొమ్మనీ కోరుతున్నాను. ఆ తర్వాత సులభ శైలిలో భగవద్గీతను తెలుగులో రచించటానికి చేసిన నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- తాళ్ళూరి సీతారామ హరగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Srimadbhagavadgita S R Book Links