• Srimad Goswami Tulasidasakruta Ramayanamu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 480
    600
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్గోస్వామి తులసీదాసకృత రామాయణము

    Srimad Goswami Tulasidasakruta Ramayanamu

    Publisher: Akella Brothers

    Pages: 680
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సాహిత్యమున రామాయణమునకు గల స్ధానము సర్వ ప్రథమమైనది. కవి యనఁగా వాల్మీకి. కావ్యమనఁగా రామాయణము అను యశస్సు నిరూఢమైనది. వేద మంత్రముల వలనఁ దెలిసికొనఁ దగిన పరమాత్మ దాశరథిగా నవతరించెను. రామునకు అయనమైన గ్రంథము రామాయణము. వాల్మీకి రామాయణము సప్త కాండ సమ్మితము.

సంస్కృత భాషలోని శ్రీమద్రామాయణము ననుసరించి యితర భాషలలో ననేక రామాయణములు వెలువడినవి. ఉత్తర భారతమున గోస్వామి తులసీదాసు అవధి భాషలో రచించిన శ్రీ రామచరిత మానసము అను మహకావ్యము బహుళ ప్రచార ప్రశస్తుల నందుకొన్నది. తులసీదాసు మహాభక్తుడు. ఆయన మహిమ సంపన్నమైన చరిత్రము నెల్లరెఱిగినది.

శ్రీఆకెళ్ల సీతారామముగారు తులసీదాసకృత రామాయణము తెనుగు వచనానువాదము సమగ్రముగా జేసి ఆంధ్ర పఠితల కనుగ్రహించినారు. బాలకాండము మొదలు రామాశ్వమేధ లవకుశ కాండము వఱకు గల యెన్మిది కాండములను మనోహరమైన తెనుగు గద్యములో వీరాంధ్రీకరించిరి.

శ్రీసీతారామముగారు శ్రీరామచరిత మానసమును సంపూర్ణముగా స్వాదు సుందరమెన తెనుగులో సుబోధ గద్యములో ననువదించిరి. వీరి యనువాదము అను వాదముగా గాక, స్వతంత్రముగా వ్రాసినట్లే యున్నది. పాఠకునకు ఇట్టి యనుభూతి కలుగునని విశ్వసించుచున్నాను.

- మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Srimad Goswami Tulasidasakruta Ramayanamu