-
-
श्रीवेङ्कटाचलमाहात्म्यम्
Sri Venkatachala Mahatmyam
Author: V Gopala Krishna Murthy
Publisher: Gayatri Publications
Pages: 242Language: Sanskrit
“A unique book on Sri Venkatachala and Lord Venkateswara”
The Skanda Mahapurana has elaborately discussed about the greatness of Sri Venktachala and amply depicted the divine story of Sri Venkteswara in 40 chapters consisting of 2,476 Slokas.
“Sri Venkatachala Mahatmyam’’ is a “Sthala Purana” of “Aadi Varaha Kshetra,” as well as the Hill Venkata, popularly known as Tirumala. It is also called “Srinivasa Purana,” the foremost authoritative and authenticated Puranic Scripture handed down to mankind. It gives us very valuable information about the topography, legendary and the History of Tirumala. It deals with the glorification of Sri Venkateswara and the Sacred Teerthas therein. Here the glorification of Kshetra, Daivata and Teerthas is substantiated by wonderful stories.
This book is unique in its nature and a marvelous one. Equipped in deep erudition in Sanskrit and Indian Culture, the author Dr. Vishnubhatla Gopala Krishna Murthy has made an exhaustive study of the story of Lord Venkateswara. He has scanned the entire Venkatachala Mahaatmyam and brought out the merits of the various legends of Venkatachala and the Divya Teerthas located on the Sacred Hill Tirumala, the mysterious and astonishing deeds of Sri Venkteswara alias Sri Srinivasa. The style of the Sanskrit language is lucid, very simple and easily understood.
Read the marvelous treatise, be enlightened and be blessed by Lord Venkteswara.
* * *
“శ్రీ వేంకటాచలంపై అద్వితీయ గ్రంథం! శ్రీ వేంకటేశ్వరునిపై అత్యద్భుత ప్రబంధం!!”
శ్రీ స్కాంద మహాపురాణంలోని వైష్ణవ ఖండంలో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం నలభై అధ్యాయాలలో, 2476 శ్లోకాలలో రమణీయంగా వర్ణించబడింది. శ్రీ వేంకటాచల మాహాత్మ్యం ఆదివరహా క్షేత్రానికి, నేటి తిరుమలగా ప్రసిద్ధిచెందిన శ్రీ వేంకటాద్రికి సంబంధించిన స్థలపురాణం. దీనికే శ్రీనివాస పురాణం అని మరొక పేరు. ఇది పరమ ప్రమాణిక గ్రంథం. ఇది తిరుమల, తిరుపతి, పరిసర క్షేత్రాలకు సంబంధించిన స్థానిక, పౌరాణిక, చారిత్రక విషయాల గురించి విలువైన సమాచారాన్ని తెలియజేస్తుంది. దీనిలో వరాహావతార వర్ణన, భూమినుద్ధరించుట, వేంకటాద్రి ఆవిర్భావం, శ్రీనివాసావిర్భావం, శ్రీ వేంకటేశ్వర వైభవం, శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం కళ్ళకు కట్టినట్లు బహు సుందరంగా చిత్ర్రీకరించబడినాయి. ఇందు క్షేత్ర, దైవత, తీర్థవైభవాలు, మాహాత్మ్యాలు, ఋషుల-భక్తుల చరిత్రలు అత్యద్భుతమైన కథల రూపంలో మనోహరంగా వివరించబడినాయి.
ఈ గ్రంథకర్త డా. విష్ణుభట్ల గోపాల కృష్ణ మూర్తి భారతీయ సంస్కృతీ సాహిత్యములలో లోతైన పరిజ్ఞానముతో శ్రీ వేంకటాచలమాహాత్య్మాన్ని కూలంకుషంగా అధ్యయనము చేసి, అందలి సారాన్ని ఈ గ్రంథ రూపంలో పొందుపరచారు. మొదటి అధ్యాయములో ఉపోద్ఘాత రూపములో పురాణ ప్రాశస్త్యం, అష్టాదశమహాపురాణ పరిచయం, పురాణ విభాగం, పురాణ సంఖ్య మొదలైన విషయాలు వివరించబడినవి. రెండవ అధ్యాయంలో స్కాంద మహాపురాణ - ఉపపురాణ విశేషాంశాలు, ఇతర పురాణాలలోని శ్రీ వేంకటాచల మాహాత్య్మ విశేషాలు వర్ణించబడినవి. ఇందలి సంస్కృత భాష సరళంగా, సులభగ్రాహ్యంగా ఉంది.
చదవండి! ఆస్వాదించండి! ఆనందించండి!
