• Sri Vasavamba
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీవాసవాంబ

    Sri Vasavamba

    Author:

    Pages: 269
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీనులు కావ్యేతి వృత్తాన్ని ప్రఖ్యాతోత్పాద్య మిశ్రమాలని మువ్విధాలుగా విభజించారు. ఈ ఇతివృత్త విభజనను ఆధునిక నవలకు కూడా వర్తింప జేయవచ్చు. అప్పుడు 'శ్రీవాసవాంబ’ లోని ఇతివృత్తం మిశ్రమ విభాగానికి చెందుతుంది.

ఈ నవలలో కథంతా వాసవి చుట్టు తిరుగుతుంది. ఈ నవలలో ఆమే ప్రధాననాయిక. ఆమె నడవడి లోకోత్తరమైంది, ఆదర్శమైంది. ఆమె వాక్కు సుకుమారమైంది, సుందరమైంది. ఆమె మనస్సు నిర్మలమైంది, నీతివంతమైంది. ఆమె ప్రతిభ అసాధారణమైంది, అకుంఠితమైంది. ఆమె జీవితం పవిత్రమైంది, దివ్యమైంది.

వాసవి పాత్ర చిత్రణలో రచయిత ఎంతో సంయమనాన్ని ప్రదర్శించినాడు. పుట్టింది మొదలు తనను అగ్నిదేవునికి అర్పించుకున్నంతవరకు జరిగిన సంఘటనలన్నీ వాసవి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి.

వాసవి నవల చదువుతుంటే వెన్నెల తోటలో విహరించి నట్లుంటుంది. ఇంతకాతోట ఏదో కాదు, భారతీయ పురాతన వైభవమే. రచయిత కేవలం జాతీయ భావాలు కల్గిన వాడే కాదు, సంప్రదాయపు మూలాలు తెలిసినవాడు. భారతీయ సాంస్కృతిక సమాజాన్ని దర్శించడమే ఈ నవలా పఠనం వల్ల కలిగే పుణ్యఫలం.

మానవ సంస్కారాల గురించి, యజ్ఞయాగాదుల గురించి, వర్ణాశ్రమ ధర్మాల గురించి, రాజనీతి గురించి, మంత్రశక్తుల గురించి, సంగీతాది కళల గురించి అనేక విషయాలు మనోజ్ఞంగా ఈ నవలలో చిత్రింపబడినాయి. ఇవన్నీ పరిశీలిస్తే నవలాకారుని లోకజ్ఞత స్పష్టమవుతుంది.

18 అధ్యాయాలలో విరచితమైన ’వాసవి’ నవల ఒక బృహద్గ్రంథమే. వివిధ పాత్రలతో, వివిధ సన్నివేశాలతో, వివిధ విషయాలతో చకచకా సాగే ఈ నవల కేవలం ఒక అమ్మాయి దివ్య చరిత్రనే కాక, భారతీయ జీవనంలోని సౌందర్యాన్ని మనకెఱుక పరుస్తుంది.

ఐతా చంద్రయ్య సంప్రదాయాన్ని గౌరవించే రచయిత. కవిత, కథకుడుగా ప్రసిద్ధికెక్కిన ఆయన చరిత్రకు నవలాకృతినిచ్చి భావితరాలకు తద్వారా గొప్ప స్ఫూర్తిని కల్గిస్తున్నాడు. కేవలం వాసవి చరిత్రను తెలుసుకోవడానికే ఈ నవల రచింపబడలేదు. ధర్మాధర్మ వివేచనకు ఇది పెద్ద పీట వేసింది.

- ఆచార్య మసన చెన్నప్ప

Preview download free pdf of this Telugu book is available at Sri Vasavamba