• Sri Vandurga Nityarchana
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వనదుర్గా నిత్యార్చన

    Sri Vandurga Nityarchana

    Publisher: Mohan Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వనదుర్గా అమ్మవారి స్వరూపము వేదములలో కూడా వక్కాణింపబడి యున్నది. ''తద్వతద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యమ్‌'' అనిశ్రుతి-బాలారిష్టములు, అవిద్యాప్రవృత్తి, ఉద్యోగ, రోగ, చోరభయములు, సంసారిక తాపత్రయ భయము, నవగ్రహదోషం, ఉన్మత్త, పైశాచిక ప్రయోగ, అభిచారిక, యాకిని, కామిని, ఢాకిని, సమస్తదోష నివారణనొసగు స్వరూపమే శ్రీవనదుర్గాయని 'రుద్రయామళ' శాస్త్రములో చెప్పబడియున్నది.

చండీ సప్తశతీ పారాయణము భారతదేశములో ప్రసిద్ధమైనప్పటికీ శ్రీవనదుర్గా పారాయణ అతిపవిత్రమైనది. విశేషమైనది. ఏలననగా పౌరాణికశాస్త్రములో చండీస్వరూపము సప్తశతి శ్లోకములందు వర్ణింపబడియున్నది. కాని వేదప్రమాణ్యము కానరాదు. పౌరాణికము మాత్రమే శ్రీవనదుర్గా మహావిద్యా పారాయణ అధర్వణ వేద ప్రోక్తమై, సామవేద అంతర్గతమై, అరణ్యేశ్వరఋషి ప్రోక్తమైయున్నది.

శ్రీవనదుర్గా అమ్మవారి ఉపాసనకేవలము పూర్ణదీక్షాపరులు, పాదుకాంతదీక్షాపరులచే ఉపాసించబడదగినది. పామరులు స్తోత్రరూపేణా ఉపాసించి ఆరాధించవచ్చును. ముక్కోటి దేవతల స్వరూపమైన శ్రీవనదుర్గ లక్ష్మీస్వరూపమైన ఐశ్వర్యాన్ని, భుక్తిని, ముక్తిని కలిగించేది. ఈ ''శ్రీవనదుర్గాదేవి''ని ఎవరు పూజిస్తారో, ఆరాధిస్తారో,ఎవరు సేవిస్తారో వారికి ఇహపర సుఖములకు లోటుండదు.

- శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి

Preview download free pdf of this Telugu book is available at Sri Vandurga Nityarchana