• Sri Vamana Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వామన పురాణం

    Sri Vamana Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో పద్నాలుగో పురాణం శ్రీ వామన మహాపురాణం. బ్రహ్మదేవుడు వామనుడి మాహాత్మ్యాన్ని కీర్తిస్తూ చెప్పిన పురాణం కాబట్టి దీనికి వామన పురాణమ్ అన్న పేరు వచ్చింది. "త్వగస్య వామనం స్మృతం" అన్న వచనాన్ని బట్టి ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీహరి చర్మంగా వర్ణించబడింది. "సంఖ్యాయా దశ సాహస్రం ప్రోక్తం కులపతే పురా" అనే వాక్యాన్ని బట్టి ఈ పురాణంలో మొత్తం పదివేల శ్లోకాలున్నాయని తెలుస్తోంది. ఈ పురాణంలో 95 అధ్యాయాలున్నాయి.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Vamana Puranam