• Sri Vaikhanasagama Samkshipta Parichayam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వైఖానసాగమ సంక్షిప్త పరిచయం

    Sri Vaikhanasagama Samkshipta Parichayam

    Publisher: Shri Veda Bharathi

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశంయొక్క ఉనికి తన ఆధ్యాత్మికతపైన ఆధారపడి ఉందనే విషయం అందరికీ తెలిసినదే. ఆ ఆధ్యాత్మికత అతి పవిత్రమైన వేదాలపైన, వేదమూలకసిద్దాంతాలపైన, వాటిని ఆధారంగా చేసుకొని విలసిల్లిన ఆచారవ్యవహారాలపైన ఆధారపడింది. విశ్వశ్రేయస్సును కాంక్షించి తపించిన మన మహర్షులు తమ పారమాత్మిక, ఆధ్యాత్మిక అనుభూతులను, రాబోయే తరతరాలువారు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించి, భిన్నభిన్న సంప్రదాయాల రూపంలో మనకందించారు. ఆ రకంగా కృషిచేసినవారు వైఖానసులు, వాలఖిల్యులు, సనకసనందనాదులు, సప్తర్షులు, ఇంకా ఎందరో, ఎందరెందరో ! వీరిలో అత్యంత కఠోరమైన దీక్షకు, తపస్సుకు మారుపేరైన వైఖానసులను గురించి వేదాలలోను, రామాయణ, మహాభారతాది ఇతిహాసాలలోను, పురాణాల్లోను కోకొల్లలుగా ప్రస్తావనలు కన్పిస్తున్నాయి. ఆ మహర్షులు, వారి శిష్యులు, ప్రశిష్యులు, చరిత్రకందని వారి కాలాలలో ప్రారంభించగా, ఆ సంప్రదాయ అనుయాయులు ఈనాటి వరకు సజీవంగా నిలబెట్టడానికి ఎంతో శ్రమించారు. అన్నింటికీ మించి కలియుగ వైకుంఠం తిరుమలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరుని, ఇంకా అనేక క్షేత్రాల్లో శ్రీ లక్ష్మీనారాయణున్ని అనేక రూపాల్లో సహస్రాబ్దాలుగా సేవిస్తూ వచ్చినవారు శ్రీ వైఖానస విధానానికి చెందినవారే! వారందరూ పడిన శ్రమకు మనం ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకోలేము. వారిని, వారి సిద్ధాంతాలను తెలుసుకొని, నమస్కరించి, సాధ్యమైనంతవరకు ఆచరించడం ద్వారా మాత్రమే మన కృతజ్ఞతలను కొంతవరకైనా తెలుపుకొనినవారము అవుతాము.

అయితే తిరుమల క్షేత్రానికి వచ్చే ఏ కొద్దిమందికో తప్ప, కోట్లాదిమందికి వైఖానస విధానాన్ని గురించిగాని, దానిని తిరుమలలో అనుసరిస్తున్నారనే విషయం గురించిగాని, తెలియదు అని అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు. ఆధునికకాలంలో ఏర్పడిన జీవన సంఘర్షణలో తమ ప్రాథమికమైన జీవన అస్తిత్వాన్ని నిలబెట్టు కోవడానికి అన్యమార్గాలలో వెళ్ళవలసి వచ్చిన ఆ కుటుంబాలలోని యువకులు కూడా ఈ వైఖానస గ్రంథ పరిశీలన చేయలేని పరిస్థితులేర్పడ్డాయి! ఇవి ఇట్లాగే కొనసాగితే, మన మూలాలను మనమే విస్మరించడం ద్వారా, ఎటువంటి పరిణామాలకైనా దారితీయగల ప్రమాద పరిస్థితులు ఏర్పడ్డాయి! ఈ పరిస్థితులను శ్రీ వేదభారతి, మరికొన్ని సంస్థలు గుర్తించడం జరిగి, ఈ సమస్యా పరిష్కారానికి తమవంతు సేవను యథాశక్తి అందిస్తున్నాయి.

శ్రీ వేదభారతి వేదశబ్ద పరిరక్షణకు, వేదవిజ్ఞాన ప్రచారానికి అహరహము కృషిచేస్తున్న ధార్మిక సంస్థ. ఒకవైపు అత్యంతము అరుదైన వేదపఠనాలను ఆధునిక కంప్యూటర్ మాధ్యమంలో నిక్షిప్తంచేసే ప్రయత్నాలు చేస్తూ, ఇంకొకవైపు మహర్షిప్రోక్తమైన సిద్ధాంతాలను, దర్శనాలను ఆధునిక శాస్త్రీయ సాంకేతిక విద్యలతో సమన్వయిస్తూ మహర్షి విజ్ఞానాన్ని పెద్ద పెద్ద గ్రంథాల రూపంలోను, సంక్షిప్తపరిచయ గ్రంథాల రూపంలోను, టి.వి.లలో ప్రసంగాల ద్వారాను సమాజానికి అందించడానికి ప్రయత్నిస్తోంది. ఆ మహాప్రయత్నం యొక్క కొనసాగింపే “వైఖానసాగమ సంక్షిప్త పరిచయం” అనే పేరుతో వెలువడుతున్న ఈ చిన్ని పుస్తకం !

- డా. రేమెళ్ళ అవధానులు

Preview download free pdf of this Telugu book is available at Sri Vaikhanasagama Samkshipta Parichayam